
అమృతలూరు: మండల పరిధిలోని కూచిపూడి, మూల్పూరు గ్రామాల్లో ఆదివారం రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్రా పారిస్, తెనాలి ఆధ్వర్యంలో వినాయక చవితి పురస్కరించుకుని మట్టి వినాయక ప్రతిమలను గ్రామస్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్ మాట్లాడుతూ పర్యావరణాన్ని రక్షించే బాధ్యత మనందరిపై ఉందన్నారు. వినాయక చవితికి ప్రతి ఒక్కరూ మట్టితో చేసిన బొమ్మలనే ఉపయోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మైనేని రత్నప్రసాద్, ఈదర వెంకట పూర్ణచంద్, మున్నంగి శ్రీనివాసరావు, జాస్తి వినోదలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





