
చిలుకూరు : చిలుకూరు, బేతవోలు, నారాయణపురం, జెర్రిపోతులగూడెం గ్రామాల్లోని సీపీఐ భవనాల వద్ద సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సాయుధ పోరాట యోధులు దొడ్డా నర్సయ్య, దొడ్డా నారాయణరావు చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సాయుధ పోరాట యోధుల ఆశయాల సాధనకు కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి, సహాయ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.






