
చాలామంది ఇళ్లలోని కుండీలలో లేదా కిచెన్ గార్డెన్లో బొప్పాయి చెట్లను ఎంతో ఆశగా పెంచుకుంటారు. చెట్టు బాగానే పెరుగుతుంది, పూత కూడా వస్తుంది.. కానీ పిందెలు కట్టకుండానే రాలిపోతుంటాయి లేదా అసలు కాయలే కాయవు. ఇలా జరిగితే మొక్కకు పోషకాల లోపం ఉందని అర్థం. మార్కెట్లో దొరికే రసాయన ఎరువులు వాడకుండా, ఇంట్లో లభించే 3 సహజసిద్ధమైన పదార్థాలతో బొప్పాయి చెట్టును కాయలతో బరువు తూగేలా చేయవచ్చు.





