
ఇంటర్నెట్‌ డెస్క్‌: కృత్రిమ మేధ ( Artificial Intelligence ) దూకుడుకు అడ్డకట్ట వేయాలని, దానిపై కఠినమైన నియంత్రణలు విధించాలని వస్తోన్న వాదనలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ( Donald Trump ) తోసిపుచ్చారు. ప్రతికూల శక్తులే ఈ సాంకేతికతపై భయాలను పెంచుతున్నాయని అన్నారు. జరగని విషయాలనే వాళ్లు లేవనెత్తుతున్నారని, వారి ఆందోళనలు అతిశయంగా ఉన్నాయని చెప్పారు. చైనాపై అమెరికా ఆధిక్యాన్ని కొనసాగించాల్సిన అవసరముందని ట్రంప్‌ స్పష్టం చేశారు. రూల్స్‌ లేని ప్రపంచం.. సిగ్నల్స్‌ లేని కూడలి లాంటిది: జిన్‌పింగ్‌ ‘‘కృత్రిమ మేధలో చైనాను అధిగమిస్తున్నాం. ప్రపంచంలోనే మనది అత్యంత అధునాతన దేశం. దానిని అలాగే కొనసాగించాలని అనుకుంటున్నా. ఎందుకంటే.. ఏఐలో ఎవరు గెలిస్తే వారిదే విజయం’’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. ఐర్లాండ్‌ పర్యటనకు వెళ్తున్న సమయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏఐపై కఠిన నియంత్రణలు తీసుకురావడం అవసరమా? అని మీడియా అడిగిన ప్రశ్నకు ఈ విధంగా స్పందించారు. అయితే, రక్షణ చర్యలు మాత్రం చేపట్టవచ్చని ట్రంప్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





