
'సైమా అవార్డ్స్ 2026'లో 'మిరాయ్' చిత్రంలో 'ది బ్లాక్ స్వోర్డ్' పాత్రకు గాను మంచు మనోజ్ 'ఉత్తమ విలన్' పురస్కారాన్ని అందుకున్నారు. సినిమా విడుదలై సరిగ్గా ఏడాది పూర్తయిన సందర్భంలోనే ఈ అవార్డు రావడం విశేషమని తెలుపుతూ ఆయన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. తాను విలన్గా రీ-ఎంట్రీ ఇచ్చినప్పటికీ ప్రేక్షకులు హీరోలా ఆదరించారని, కష్టకాలంలో తనకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులకు, భార్య మౌనికకు, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనికి, అభిమానులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.




