
రెక్కలు లేకున్నా గాల్లో ప్రయాణించగల వింత జీవి పారడైజ్ ఫ్లయింగ్ స్నేక్. ఇది తన శరీరాన్ని బల్లపరుపుగా చేసి, గాలి సాయంతో చెట్ల మధ్య గ్లైడ్ అవుతుంది. దక్షిణ, ఆగ్నేయాసియా ప్రాంతాల్లో కనిపించే ఈ పాము, ఆహారం కోసం లేదా ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఈ అద్భుతమైన సామర్థ్యాన్ని ఉపయోగిస్తుంది. నిజంగా ప్రకృతిలోని ఓ వింతైన సృష్టి.






