
WTC 2027: టెస్ట్ క్రికెట్లో ఇంగ్లాండ్ దిగ్గజ బ్యాటర్ జో రూట్ సరికొత్త శిఖరాన్ని చేరుకున్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. తన సహచర ఆటగాడు హ్యారీ బ్రూక్‌ను కేవలం ఒక్క పరుగు తేడాతో వెనక్కి నెట్టి అగ్రపీఠాన్ని దక్కించుకోవడం విశేషం. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ టెస్టుల్లో తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ వర్తమాన సైకిల్లో రూట్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 30 ఇన్నింగ్స్‌ల్లో ఆయన ఏకంగా 1272 పరుగులు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. ఇందులో 5 సెంచరీలు కూడా ఉన్నాయి. రెండవ స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ 29 ఇన్నింగ్స్‌ల్లో 1271 పరుగులు చేసి రూట్‌కు అతిసమీపంలో ఉన్నారు. వీరిద్దరి మధ్య ఉన్న తేడా కేవలం ఒక్క పరుగు మాత్రమే కావడంతో మొదటి స్థానం కోసం హోరాహోరీ పోరు సాగుతోంది.





