
శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో మౌంటేన్ క్లైంబర్స్ సహాయపడుతుంది. పొత్తి కడుపు, తొడలు, నడుము చుట్టూ ఉన్న కొవ్వును ఈజీగా కరిగిస్తుంది.
జంపింగ్ జాక్స్ వ్యాయామం చూడటానికి సింపుల్గా అనిపించినా ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది. ప్రతిరోజూ ఈ ఫుల్ బాడీ కార్డియో ఎక్సర్సైజ్ చేస్తే శరీరంలో వివిధ ప్రాంతాల్లో పేరుకుపోయిన కొవ్వు ఈజీగా కరిగిపోతుంది.
పుష్ అప్స్, స్క్వాట్, ప్లాంక్, జంపింగ్ వంటి అనేక రకాల వ్యాయామాలు అన్నీ కలిపి బర్బీస్గా చెబుతారు. ప్రతిరోజూ ఈ ఒక్క వ్యాయామానికి సమయం కేటాయిస్తే శరీరంలోని కొవ్వును సులువుగా తగ్గించుకోవచ్చు.
ఒకే ప్రదేశంలో ఉండి రన్నింగ్ చేయడమే హై నీస్ ఎక్సర్సైజ్. ఇలా చేయడం వల్ల పూర్తి బాడీపై ఒత్తిడి పడి కొవ్వు సులువుగా కరుగుతుంది.
ప్లాంక్ ఎక్సర్సైజ్ చేయడం అంత సులువేం కాదు. ప్రతిరోజూ నిమిషం నుంచి రెండు నిమిషాలు ప్లాంక్ పొజిషన్లో ఉంటే ఫుల్ బాడీ ఫ్యాట్ ఈజీగా తగ్గించుకోవచ్చు.
అప్పర్ బాడీ, లోయర్ బాడీ అంటూ లేకుండా ఫుల్ బాడీకి బైసైకిల్ క్రంచెస్ ఉపయోగపడుతుంది. ఈ వ్యాయామం చేయడం ద్వారా ఈజీగా కొవ్వును తగ్గించుకోవచ్చు.
నార్మల్ స్క్వాట్స్ కాకుండా బరువు ఎత్తి చేసే స్క్వాట్స్ ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఈ స్క్వాట్స్ రెగ్యులర్గా చేయడం ద్వారా శరీరంలోని కొవ్వును తగ్గించుకోవచ్చు.
ఫుల్ బాడీ ఎక్సర్సైజ్గా పుష్ అప్స్ చాలా మేలు చేస్తుంది. ప్రతిరోజూ 30 వరకు పుష్ అప్స్ తీస్తే పొత్తి కడుపు, ఛాతి, భుజాలు, తొడలు, నడుము దగ్గర కొవ్వును ఈజీగా కరిగించుకోవచ్చు.
యోగాసనాల్లో సేతు బంధాసనం అని పిలుస్తారు. ఈ వ్యాయామం రోజూ చేయడం ద్వారా పొత్తి కడుపు, నడుము, తొడల దగ్గర కొవ్వు సులువుగా తగ్గుతుంది.





