
నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్‌భాస్కర్, అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రలు పోషిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘క్రేజీ కల్యాణం’. బద్రప్ప గాజుల దర్శకుడు. బూసం జగన్మోహన్రెడ్డి నిర్మాత. త్వరలో సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ పాటను మేకర్స్ విడుదల చేశారు. ‘కాకా ధూమ్ ధమాకా.. లగ్గం ఇంట్ల పందిర్లే పడ్డాక.. అరే బాపు రచ్చ లేపు.. ఈడ గుమ్మిగూడాక, మూడు ముళ్ల సంబరాల ఢోలు బాజా కొట్టు.. కొంగుముళ్ల సంతోషాల లొల్లే సూపెట్టు’ అంటూ తెలంగాణ మాండలికంలో కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను సురేష్ బొబ్బిలి స్వరపరచగా, జంగిరెడ్డి ఆలపించారు. ర్యాప్ వోకల్స్‌ని కాసర్ల శ్యామ్ పాడారు. పెళ్లి భరాత్‌లో చేసే ఎనర్జిటిక్ మాస్ స్టెప్పులతో ఆడియన్స్ మెచ్చేలా ఈ పాట సాగింది. ఈశ్వర్ పెంటి కొరియోగ్రఫీ ఈ పాటకు హైటైట్. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ దూపాటి.





