
ప్రణయ్ దేవరాజ్, సంజనా ఆనంద్ జంటగా నటిస్తున్న వినోదాత్మక కుటుంబ కథాచిత్రం ‘శ్రీరస్తు’. శంకర్‌రెడ్డి దర్శకుడు. పెండ్లిమడుగు హరికృష్ణగౌడ్ నిర్మాత. ఏకకాలంలో తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతున్నది. కుటుంబ భావోద్వేగాలు, ప్రేమ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని, యువతరం మెచ్చే సినిమా అవుతుందని మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానున్నది. సుమన్, దేవిప్రసాద్, ఆమని తదితరలు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బాలసరస్వతీ, సంగీతం: శేఖర్‌చంద్ర, నిర్మాణం: హరి క్రియేషన్స్.




