
రెండేండ్ల క్రితం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు మోహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకునేది లేదని తేల్చిచెప్పిన భారత క్రికెట్ జట్టు మరోసారి అదే విధానాన్ని అవలంభించింది. తాజాగా ఆసియా కప్ గెలిచిన తర్వాత హర్మన్‌ప్రీత్ కౌర్ సేన సైతం ట్రోఫీని తీసుకోకుండానే డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయింది. 2025లోనూ సూర్యకుమార్ యాదవ్ సేన ఆసియా కప్ ట్రోఫీని తీసుకోకుండానే వెనుదిరిగిన విషయం తెలిసిందే. మ్యాచ్ ముగిశాక బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా.. జట్టుతో సమావేశమైన తర్వాత భారత ఆటగాళ్లు గ్రౌండ్లోకి కూడా రాలేదు. నఖ్వీ ఎప్పట్లాగే వేదికపై వేచి చూసి ట్రోఫీ ఇవ్వకుండానే తిరిగి వెళ్లిపోయాడు.




