
తిరుమల: తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం సాయంత్రం 6.21 నుంచి 6.35 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేశారు. సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ముందుగా బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని, పరివార దేవతలైన శ్రీ అనంత, గరుడ, చక్రత్తాళ్వార్‌, సేనాధిపతి వారిని, ధ్వజపటాన్ని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దజీయర్, చిన్న జీయర్, తితిదే ఈవో ముద్దాడ రవిచంద్ర, కంకణ బట్టర్ వెంకట రాఘవ దీక్షితులు, తితిదే బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, భాను ప్రకాశ్‌రెడ్డి, పనబాక లక్ష్మి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తిరుమల: తిరుమలలోని శ్రీ గాయత్రి నిలయానికి ఏపీ సీఎం చంద్రబాబు చేరుకున్నారు. తితిదే ఛైర్మన్‌ బీఆర్ నాయుడు పుష్ప గుచ్ఛం అందజేసి సీఎంకు స్వాగతం పలికారు. సీఎంకు స్వాగతం పలికినవారిలో తితిదే ఛైర్మన్‌ వెంట అదనపు ఈవో వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





