
భామిని: గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపంతో బాధపడుతున్న వారిని గుర్తించి చైతన్య పర్చేందుకు పోషకాహార మాసోత్సవంలో భాగంగా మంగళవారం బాలేరు, బత్తిలి గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భామిని ఐసీడీఎస్ సీడీపీవో శాంతిభవాని మాట్లాడుతూ.. ఆకుకూరలు, కోడిగుడ్లు, పాలు వంటివి తీసుకోవడం వల్ల మానసికంగా, శారీరకంగా ఎలాంటి ఎదుగుదల ఉంటుందనే అంశాలపై అవగాహన కల్పించారు. చిన్నారుల్లో ఆహారం ఒకేసారి కాకుండా ఎక్కువ సార్లు తక్కువ మొత్తంలో ఇవ్వడం వలన వారిలో తినే అలవాటు పెరుగుతుందని, వ్యక్తిగత పరిసరాల శుభ్రతతోనే ఆరోగ్యం సాధ్యమని వివరించారు. పోషణ లోపంతో బాధపడే చిన్నారులు, గర్భిణులు బాలింతలకు మెరుగైన ఆహారాన్ని అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది జ్యోతిలక్ష్మి, సుధావాణి, సబితాపట్నాయక్ తదితరులున్నారు. మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలి భామిని: ప్రజలకు అవసరమైన అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆర్ఓఎస్ఆర్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ బలివాడ ఆదినారాయణ తెలిపారు. మంగళవారం ఆర్ఓఎస్ఆర్ జిల్లా కో-ఆర్డినేటర్లు, కొత్తురు వెలుగు స్వచ్చంద సంస్థ ప్రతినిధులతో కలిసి బాండ్రసింగి, కడంబసింగి, మూలగూడ గిరిజన గ్రామాల్లో క్షేత్రస్థాయి పర్యటన చేశారు. ఆయా గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. గ్రామాల్లో నివసిస్తున్న ప్రజల స్థితిగతులు, వారి ప్రాథమిక అవసరాలు, ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆదినారాయణ మాట్లాడుతూ.. గ్రామాల్లో వాస్తవ పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించడం ద్వారా ప్రజల అవసరాలు, సమస్యలపై స్పష్టమైన అవగాహన ఏర్పడిందని, భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలకు ఉపయోగపడే కీలక సమాచారాన్ని సేకరించామని చెప్పారు. ఆయన వెంట జిల్లా ఆర్ఓఎస్ఆర్ కో-ఆర్డినేటర్లు గజదీష్, సుధీర్, మధు, వెలు స్వచ్చంద సంస్థ డైరెక్టర్ సంజీవరావు తదితరులున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





