
ఇబ్రహీంపట్నం: యూట్యూబర్‌ నందన (YouTuber Nandana) మంగళవారం సాయంత్రం ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌ వచ్చారు.షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 16లోగా స్టేషన్‌లో హాజరుకావాల్సి ఉంది. దీంతో ఒకరోజు ముందే ఆమె పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో అరెస్టయిన నందనను పోలీసులు ఇబ్రహీంపట్నం పీఎస్‌కు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడ్డారంటూ నందన, ఆమె భర్తపై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో పలువురు బాధితులు ఫిర్యాదు చేయడంతో ఇబ్రహీంపట్నం పీఎస్‌లో గతంలో కేసు నమోదైంది. ఈ విషయం వెలుగులోకి రాగానే నందన దంపతులు అజ్ఞాతంలోకి వెళ్లడంతో ఏపీ పోలీసులు లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌(ఎల్‌వోసీ) జారీ చేశారు. ఈ క్రమంలో బ్రిటిష్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో స్వదేశానికి ఒంటరిగా బయలుదేరిన నందన సోమవారం శంషాబాద్‌లో దిగారు. ఆమె పాస్‌పోర్ట్, వీసా పత్రాలు తనిఖీ చేసిన ఇమిగ్రేషన్‌ అధికారులు ఎల్‌వోసీ ఆధారంగా అదుపులోకి తీసుకొని ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు. విహారయాత్రలో విషాదం.. సోకిలేరు వాగులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ గల్లంతు .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.