
పండగంటేనే సరదాలు, జ్ఞాపకాలు. అలాంటిది ఒకటి, రెండు కాదు.. పది రోజుల పాటు జరుపుకొనే వినాయక చవితి నవరాత్రోత్సవాల్లో.. సొంతమయ్యే అనుభూతులకు లెక్కే లేదు. ‘మీకే కాదు.. అలాంటి జ్ఞాపకాలు మాకూ ఉన్నాయం’టున్నారు కొందరు తారలు. పండగంటేనే సరదాలు, జ్ఞాపకాలు. అలాంటిది ఒకటి, రెండు కాదు.. పది రోజుల పాటు జరుపుకొనే వినాయక చవితి నవరాత్రోత్సవాల్లో.. సొంతమయ్యే అనుభూతులకు లెక్కే లేదు. ‘మీకే కాదు.. అలాంటి జ్ఞాపకాలు మాకూ ఉన్నాయం’టున్నారు కొందరు తారలు. వినాయక చవితి సందర్భంగా.. ఆ అనుభవాలు, అనుభూతుల్ని ఇలా పంచుకుంటున్నారు.. గత కొన్నేళ్ల నుంచి మా ఇంట్లో మట్టి వినాయకుడిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. అలా ఈ ఏడాది కూడా విత్తన గణపతిని మా ఇంటికి తీసుకొచ్చా. విగ్రహమే కాదు.. మండపం అలంకరణ కూడా పర్యావరణహిత వస్తువులతోనే చేస్తాం. వినాయక చవితికి ఇంట్లో గణపతి విగ్రహం ముందు కలశం పెట్టి.. చేసిన నైవేద్యాలను దేవుడికి సమర్పిస్తాం. ఈ పండక్కి కుడుములు, కజ్జికాయలు.. తయారుచేస్తాం. ఏ పండగైనా మా ఇంట్లో అరటి ఆకుల్లో భోజనం చేయడం సంప్రదాయం. పూజ పూర్తయ్యాక అందరం కలిసి ఇలా తింటుంటే భలే సరదాగా అనిపిస్తుంటుంది. ఇక పది రోజుల పాటు గణపతిని పూజించాక ఇంట్లో ఉండే పూలకుండీలో పెట్టి నిమజ్జనం చేస్తాం. ఇలా పర్యావరణహితంగా పండగ చేసుకోవడం వల్ల అటు ప్రకృతికి, ఇటు మనకు మేలు జరుగుతుంది. చిన్నప్పుడు మా వీధిలోని పిల్లలమంతా కలిసి ఇంటింటికీ తిరుగుతూ చందాలు పోగు చేసి, దాంతో వినాయక విగ్రహం ఏర్పాటు చేసేవాళ్లం. రోజూ రెండు పూటలా పూజలు, ప్రసాదాలు పంచడం.. ఇలా ఆ సరదాల్ని ఎప్పటికీ మర్చిపోలేను. పెరిగి పెద్దయ్యే కొద్దీ రంగురంగుల పీఓపీ విగ్రహాల్ని ఇష్టపడేదాన్ని. కానీ అవి పర్యావరణానికి హానికరం అని తెలిశాక మట్టి విగ్రహాల్ని పూజించడం మొదలుపెట్టా. ఇక పెళ్లయ్యాక నా భర్త ఆదితో కలిసి పండగ జరుపుకోవడం ఎన్నో మధురానుభూతుల్ని పంచుతోంది. రంగురంగుల పూలు, దీపాలతో మండపాన్ని అలంకరించడం నాకిష్టం. మోదకాలు, పూర్ణాలు, లడ్డూలు, కజ్జికాయల్ని వినాయకుడికి నైవేద్యంగా సమర్పిస్తాం. అయితే ఈ వినాయక చవితి పండగలో గణపతి నిమజ్జనం నన్ను భావోద్వేగానికి గురిచేస్తుంది. కాకపోతే మట్టి గణపతిని ఇంట్లోనే నిమజ్జనం చేస్తాం కాబట్టి ఆ బుజ్జి వినాయకుడు ఎప్పటికీ నాతోనే ఉన్నాడన్న సంతృప్తి కలుగుతుంది. పండగంటేనే అందరూ కలిసి జరుపుకొనేది. అందుకే మా ఇంట్లో జరిగే ప్రతి పండగలో మా బంధువులతో పాటు నా ప్రాణ స్నేహితులూ భాగమవుతారు. వినాయక చవితి కూడా ఇలాగే సరదాగా సెలబ్రేట్‌ చేసుకుంటాం. నా చేతులతో స్వయంగా విగ్రహం తయారుచేసి పూజించడం నాకు అలవాటు. మోదకాలు, లడ్డూలు, ఇతర స్వీట్లు తయారుచేసి ఆ స్వామికి నైవేద్యంగా సమర్పిస్తాం. ఇక ఈ పండగ రోజున సంప్రదాయబద్ధంగా తయారవడానికే ఇష్టపడతా. చీర లేదా లంగా-వోణీ వేసుకుంటా. పూజ పూర్తయ్యాక బంధువులకు ప్రసాదాలివ్వడం, స్నేహితులతో కలిసి సరదాగా మాట్లాడుతూ భోజనం చేయడం.. ఇవన్నీ మర్చిపోలేని మధురానుభూతులే! గణేష్‌ చతుర్థి నాకిష్టమైన పండగ. నా జీవితంలో నేను ఎదుర్కొన్న ఒడిదొడుకుల్లో గణపతే నాకు తోడుండి నన్ను పాజిటివిటీతో ముందుకు నడిపించాడనిపిస్తుంటుంది. చిన్నప్పట్నుంచి ఈ పండగని బంధువులు, స్నేహితులతో కలిసి జరుపుకోవడం నాకు అలవాటు. ఈ రోజున మా కుటుంబ సభ్యులందరం ఒక్క చోట చేరతాం. ముఖ్యంగా పూజ పూర్తయ్యాక హారతిస్తూ పాటలు పాడడం నాకు చాలా ఇష్టం. ఇక ఈ రోజున తయారుచేసే మోదకాలంటే మరీనూ! షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నా.. ఈ పండక్కి మాత్రం ఇంట్లోనే ఉంటా.. మోదకాలు మాత్రం అస్సలు మిస్సవను. అయితే చిన్నతనంలో వీటిని నాకు తొలిసారి పరిచయం చేసింది మా అమ్మమ్మే! ఓసారి వినాయక విగ్రహాలు తయారుచేసే షెడ్డుకు వెళ్లాను. మట్టిని విగ్రహాలుగా తీర్చిదిద్దే క్రమంలో అక్కడి కళాకారుల నైపుణ్యాలు, వాళ్ల ఓపిక చూసి ముచ్చటేసింది. అప్పట్నుంచి నేనే స్వయంగా విగ్రహం తయారుచేసుకోవడం మొదలుపెట్టా. ఈ ప్రక్రియ నాకు ధ్యానం చేసినంత ఫలితాన్నిస్తుంది. నాకు ఏనుగులంటే చాలా ఇష్టం. అందుకే ఏనుగు ముఖాన్ని అమర్చుకున్న గజాననుడే నాకిష్టమైన దేవుడు. ఆ స్వామిని తలచుకోగానే ఏదో తెలియని ఉత్సాహం వస్తుంది. మన జీవితాల్లో సకల విఘ్నాల్ని తొలగించే ఈ ఏకదంతుడు.. కొన్నిసార్లు మనం ఎదుర్కొనే సవాళ్లూ మన జీవితాన్ని సన్మార్గంలో నడిపిస్తాయన్న పాఠాన్ని బోధిస్తాడు. ఇక ఈ పండగ రోజున మా స్నేహితుల ఇళ్లకు వెళ్లడం, విఘ్నేశ్వరుడి ఆశీస్సులు తీసుకోవడం, మా ఇంటికి దగ్గర్లోని వినాయక మండపాలకు వెళ్లి.. అక్కడ కొలువుదీరిన విభిన్న మూర్తుల్ని సందర్శించుకోవడం.. ఇవన్నీ ఈ పండగ నాకిచ్చిన మధురానుభూతులే! వినాయక చవితి శుభాకాంక్షలు! .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. For Editorial Feedback eMail: For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in © 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd, . Powered By Margadarsi Computers This website follows the DNPA Code of Ethics . Privacy and cookie settings





