Bhagat Singh అంటే భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో సాహసం, త్యాగం, విప్లవం గుర్తుకు వస్తాయి. ఉరికొయ్యను కూడా చిరునవ్వుతో ఎదుర్కొన్న యువ విప్లవకారుడిగా ఆయనకు చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. అయితే భగత్ సింగ్ను కేవలం తుపాకీ పట్టిన విప్లవ వీరుడిగా మాత్రమే చూడటం ఆయన వ్యక్తిత్వాన్ని పరిమితం చేయడమే అవుతుంది. ఆయన గొప్ప అధ్యయనశీలి, ప్రగతిశీల ఆలోచనాపరుడు, మానవతావాది, సామాజిక మార్పును కోరుకున్న విప్లవకారుడు. కేవలం 23 ఏళ్ల వయస్సులోనే భగత్ సింగ్ అనేక రాజకీయ, సామాజిక, తాత్విక అంశాలపై లోతుగా ఆలోచించారు. జైలు జ