
అనంత నగరపాలకం: అనంతపురంలోని డంపింగ్ యార్డులో ఇప్పటికే రెండు లక్షల టన్నుల చెత్తను తరలించామని అనంతరం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పేర్కొన్నారు. గురువారం అనంతపురం నగరంలో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాన్ని ఎంపీ అంబికాలక్ష్మీనారాయణతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డంపింగ్ యార్డులోని చెత్తను పూర్తిగా తరలించి, అందులో పార్కును ఏర్పాటు చేస్తామన్నారు. నా వీధి, నా ఊరు, నా దేశం బాగుండాలనే భావన ప్రతి ఒక్కరికి రావాలన్నారు. ప్లాస్టిక్ రహిత, పరిశుభ్రమైన నగరంగా అనంతపురాన్ని తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ జస్వంతరావు, నగర ప్రజారోగ్య అధికారి రాజా రవీంద్రనాథ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




