
తిరుమల (Tirumala)లో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మూడోరోజు గురువారం ఉదయం సింహ వాహనంపై శ్రీమలయప్పస్వామి తిరుమాడ వీధుల్లో విహరించారు. యోగ నృసింహుడిగా భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు సంప్రదాయ, జానపద ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. భక్తుల గోవిందనామ స్మరణతో తిరుగిరులు మార్మోగాయి. ఈ వీడియో చూశారా: లక్ష లక్ష్మీ కాసులు.. 50 వేల చాక్లెట్లతో.. గణేశుడి దర్శనం




