
Anakapalli Movie | భవ్య శ్రీ మూవీ మేకర్స్ మరియు నక్కిన నెరేటివ్స్ పతాకాలపై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అనకాపల్లి’ సినిమా విడుదలకు సర్వం సిద్ధమైంది. అక్టోబర్ 2వ తేదీన ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రంలో నటుడిగా, నిర్మాతగా ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన మరియు కాండ్రేగుల నాయుడు కీలక పాత్రలు పోషిస్తూ నిర్మాణ బాధ్యతలు కూడా నిర్మించారు. విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ సినిమాకు ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించారు. కాండ్రేగుల కుమార్ రాజా కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తూ, కథ మరియు స్క్రీన్‌ప్లే రూపకల్పనలో తన వంతు సహకారం అందించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ మరియు పాటలు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను రాబట్టి సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ముఖ్యంగా, కొద్ది రోజుల క్రితం అనకాపల్లి స్థానిక ప్రజల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ప్రీమియర్ షోకు విశేషమైన స్పందన లభించింది. సినిమా చూసిన స్థానిక ప్రజలు చిత్ర యూనిట్‌కు బ్రహ్మరథం పట్టడంతో మేకర్స్‌లో జోష్ మరింత పెరిగింది. ఈ క్రమంలోనే వినాయక చవితి పండుగను పురస్కరించుకుని విడుదల చేసిన సరికొత్త రిలీజ్ డేట్ పోస్టర్ సినిమాపై క్యూరిసిటీని రెట్టింపు చేసింది. కేవలం తెలుగులోనే కాకుండా, తమిళ భాషలోనూ ఈ సినిమాను ఒకేసారి భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలైన మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పి మరియు పూర్వి డిస్ట్రిబ్యూషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకువస్తున్నాయి. టెక్నికల్ పరంగా కూడా ఈ సినిమా అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కింది. మాయా.వి సినిమాటోగ్రఫీ అందించగా, శ్రీకృష్ణ అట్టలూరి ఎడిటర్‌గా వ్యవహరించారు. విజయవంతమైన డైరెక్టర్ త్రినాధరావు నక్కిన అందించిన కథ, స్క్రీన్‌ప్లే ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలవనుండగా, ఉదయ్ భాగవతుల అందించిన మాటలు ప్రత్యేక ఆకర్షణగా మారనున్నాయి. దేవ్ జండ్ సంగీతం సమకూరుస్తుండగా, అనంత శ్రీరామ్, కెకె, గణేష్ సలాది, రాంబాబు గోశాల, తేజ గొర్లె వంటి ప్రముఖులు సాహిత్యమందించారు. శేఖర్ విజె, యష్ మాస్టర్, జిత్తు మాస్టర్ కొరియోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ చిత్రంలో విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్పలతో పాటు త్రినాధ రావు నక్కిన, ఇంద్రజ అబ్సర్, మహబూబ్ బాషా, శ్రీనివాస్ వడ్లమాని, కాండ్రేగుల నాయుడు, నందిని రాయ్, సంగీత క్రిష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా సెట్రామరాజు మల్లెల, ప్రొడక్షన్ డిజైనర్‌గా రఘు కులకర్ణి వ్యవహరించారు. పీఆర్ఓగా సాయి సతీష్ మరియు మార్కెటింగ్‌గా స్టార్ సర్కిల్ వ్యవహరిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 2న బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.





