
టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమా టాక్సిక్ : ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్ అప్స్. కేజీఎఫ్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా గ్యాంగ్ స్టర్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఓ రేంజ్ హైప్ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆగష్టు 26న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి అంతగా రెస్పాన్స్ రాలేదు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా దాదాపు రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. నివేదికల ప్రకారం ఈ సినిమాను సెప్టెంబర్ 25 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లా్ట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
Tags:#toxic
Found this helpful?
Share this story with your network