
UPI in Greece | దిల్లీ: దేశీయ డిజిటల్ చెల్లింపుల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన యూపీఐ ఇతర దేశాలకూ విస్తరిస్తోంది.
భారత యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) సేవలు తాజాగా గ్రీస్‌లోనూ అందుబాటులోకి వచ్చాయి. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రస్తుతం గ్రీస్‌లోని ఏథెన్స్లో పర్యటిస్తున్న వేళ ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
యూరోబ్యాంక్- ఎన్ఐపీఎల్ భాగస్వామ్యంతో ఈ యూపీఐ సేవలు ప్రారంభించారు. దీని ద్వారా అర్హత కలిగిన వినియోగదారులు తక్కువ ఖర్చుతో వేగంగా, సురక్షితంగా డబ్బు బదిలీ చేసుకోవచ్చని పీయూష్ గోయల్ ఎక్స్‌లో పేర్కొన్నారు. ఇటీవల ఫ్రాన్స్‌లోని నైస్ నగరంలోనూ, అంతకుముందు పారిస్‌లోని ఈఫిల్ టవర్ వద్ద యూపీఐ సేవలు ప్రారంభించారు. ప్రస్తుతం గ్రీస్‌తో కలిపి సింగపూర్, యూఏఈ, ఫ్రాన్స్, మారిషన్, నేపాల్, భూటన్, ఖతార్, శ్రీలంక, కంబోడియా సహా మొత్తం 10 దేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి. భారత పర్యాటకులు విదేశాల్లో సులభంగా డిజిటల్ చెల్లింపులు చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్ 2026, అమెజాన్ ప్రైమ్ డే సేల్ జులై 4 నుంచి ప్రారంభం కానున్నాయి.