
కామెడీ కింగ్ అల్లరి నరేశ్ నటిస్తున్న 65వ చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. చంద్ర మోహన్ చింతాడ దర్శకుడు. కామెడీ కింగ్ అల్లరి నరేశ్ (Allari NAres) నటిస్తున్న 65వ చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’.
చంద్ర మోహన్ చింతాడ దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫాంటసీకి వినోదాన్ని జోడిస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘కామెడీ గోస్ కాస్మిక్’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్ ఇచ్చారు. మంగళవారం అల్లరి నరేశ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది.
ఇందులో నరేశ్ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన స్వర్గలోకపు మెట్లపై కూర్చుని, చేతిలో కలం, ‘రంభ ఊర్వశి, మేనక’ పేర్లు రాసి ఉన్న పేపర్ పట్టుకుని ఉండగా, పైన మేఘాల మధ్య అప్సరసలు కనిపిస్తున్నారు. డివైన్ ఎలిమెంట్స్, ఎంటర్టైన్మెంట్తో ఈ క్రియేటివ్ డిజైన్ అల్లరి నరేశ్ మార్క్ కామెడీని చూపుతోంది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, నరేష్ వి.కె., శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.