
కాస్త లావుగా ఉంటే సినిమా అవకాశాలు రావేమోనని ఎంతో మంది తారలు సన్నబడుతుంటారు. ఆ కోవలో తాను లేనని నిరూపిస్తోంది.. నటి అంజలి ఆనంద్.
ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో అంజలిని బాడీ షేమింగ్ చేసినా తన శరీరతత్వాన్ని మార్చుకోకుండా.. తనకు వచ్చిన అవకాశాలతో బాలీవుడ్లో దూసుకెళ్తోంది.
తాజాగా అజయ్ దేవగణ్, రితీశ్ దేశ్‌ముఖ్ నటించిన ‘ధమాల్ 4’లో అంజలి కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రం జులై 10న విడుదల కానుంది.
మరాఠీలో పాపులరైన ‘గులాబీ సాడి’ పాటను ఈ చిత్రంలో రీమేక్ చేశారు. గులాబీ శారీలో అంజలిని చూసి యూత్ ఫిదా అయింది.
ఈమె ముంబయిలో పుట్టి పెరిగింది. తల్లిదండ్రులు దినేశ్ ఆనంద్, పూర్ణిమ 1970-80 నాటి బాలీవుడ్ చిత్రాల్లో జూనియర్ ఆర్టిస్టులుగా పనిచేశారు.
ఈ బీటౌన్ బ్యూటీ 2017లో వచ్చిన ‘ఉంటాగ్’ వెబ్‌సిరీస్‌తో నటిగా మారి.. ‘దాయ్ కిలో ప్రేమ్’ సీరియల్‌తో బుల్లితెరకు పరిచయమైంది.
ఆ తర్వాత ‘కుల్ఫీ కుమార్ బజేవాలా’ సీరియల్‌తో బాగా పాపులారిటీ తెచ్చుకుంది. బొద్దుగా ఉన్నా.. ప్రేక్షకులకు భలే నచ్చేసింది.
మొదట్లో పెళ్లిళ్లలో కొరియోగ్రాఫర్‌గా, మోడల్‌గా పనిచేసిన అంజలి.. తనకు నటిగా అవకాశమొస్తుందని అసలు ఊహించనేలేదట.
ఓ సంగీత్‌లో ఈమెను చూసిన ‘దాయ్ కిలో ప్రేమ్’ క్రియేటివ్ డైరెక్టర్ సందీప్ సికంద్.. నటిగా సీరియల్లో ఛాన్స్ ఇచ్చారు.
తన నటనకు ప్రశంసలు దక్కుతున్నా.. బరువుపై సోషల్‌మీడియాలో చాలా ట్రోల్స్ వస్తుంటాయి. వాటికి ఈ భామ.. ఘాటుగానే స్పందిస్తుంటుంది.
అంజలి ఎత్తు ఆరడుగులు. తన హైట్‌కు, పర్సనాలిటీకి భారత్‌లో డిజైనర్ దుస్తులే దొరకవట. అందుకే, విదేశాల నుంచి తెప్పించుకుంటానని చెప్పింది.
‘‘నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. ఎవరెన్ని చెప్పినా ఇంకొరిలా ఉండాల్సిన అవసరం మనకు లేదు’’అని తనలాంటి అమ్మాయిలకు సలహా ఇచ్చింది.
యూట్యూబ్‌లో అదరగొట్టి.. సినిమా ఛాన్స్ పట్టేసి..
200 భాషల్లో ‘వారణాసి’ .. ప్రియాంక క్రేజీ ముచ్చట్లు..