
Venezuela Earthquakes| ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల సంభవించిన జంట భూకంపాలు వెనెజువెలాకు భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. ఆ దేశంలో 58 వేలకుపైగా భవనాలు ధ్వంసమైనట్లు నాసా అంచనా వేసింది.
జూన్ 25న సేకరించిన ఉపగ్రహ డేటా ఆధారంగా ఈ లెక్కలు వెల్లడించింది.
క్షేత్రస్థాయిలో విధ్వంస ప్రభావాన్ని అంచనావేసి, సహాయక బృందానికి మార్గనిర్దేశం చేసేందుకు ఈ శాటిలైట్ డేటా ఉపయోగపడుతుందని నాసా పేర్కొంది. అయితే.. 855 భవనాలు దెబ్బతిన్నాయని, వాటిలో 189 పూర్తిగా ధ్వంసమయ్యాయని వెనెజువెలా నేషనల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ జార్జ్ రోడ్రిగ్జ్ వెల్లడించడం గమనార్హం. ఈ భవన శిథిలాల కింద వేల సంఖ్యలో ప్రజలు చిక్కుకొని ఉంటారనే ఆందోళన నెలకొంది. వారిని బయటకు తీసినా ప్రాణాలతో ఉంటారనే ఆశలు సన్నగిల్లుతున్నాయి.
మరోవైపు, గల్లంతైన వారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. సహాయక చర్యలపై ప్రభుత్వం వైపు నుంచి వస్తోన్న పరిమిత సమాచారం వారిలో అసహనాన్ని నింపుతోంది. ఈ క్రమంలో వాట్సప్ ఒక అత్యవసర నెట్వర్క్గా మారింది. ఆసుపత్రిలో చేరినవారి వివరాలు, గల్లంతైన వ్యక్తులు, కూలిన భవనాలకు సంబంధించిన వివరాలను షేర్ చేస్తూ వాట్సప్ గ్రూప్లను ఒక రిజిస్ట్రీగా మార్చారు. ప్రభుత్వం వైపు నుంచి భారీ సమాచార లోటును ఈ గ్రూప్లు భర్తీ చేస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.