
సంపద అనగానే డబ్బు, ఆస్తి, నగలు... ఇవే గుర్తుకు వస్తాయి. కానీ సామాజిక సంపదకూ అంతే ప్రాధాన్యం ఉంటుంది. నేటి మహిళ అనేక రంగాల్లో రాణిస్తూ సమాజంలో కీలకంగా మారుతున్న నేపథ్యంలో దీని అవసరం ఎంతైనా ఉంది.
సంపద అనగానే డబ్బు, ఆస్తి, నగలు... ఇవే గుర్తుకు వస్తాయి. కానీ సామాజిక సంపదకూ అంతే ప్రాధాన్యం ఉంటుంది. నేటి మహిళ అనేక రంగాల్లో రాణిస్తూ సమాజంలో కీలకంగా మారుతున్న నేపథ్యంలో దీని అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుత డిజిటల్ యుగంలో సామాజికం అనగానే సోషల్ మీడియా వేదికలూ, అక్కడ ఫాలోయర్లే గుర్తొస్తారు. కానీ వాస్తవమైన సమాజం, సామాజిక సంపద అవి కాదు. మీపైన ఇతరులకు ఉన్న నమ్మకం, మీరు నిర్మించుకున్న అనుబంధాలు, సమాజంపైన మీరు చూపే ప్రభావం.. ఇలా సమాజంలో మీ ప్రాధాన్యమే మీ సామాజిక సంపద. ఇక్కడ మీ సంపద అధికంగా ఉందంటే... మీ ఆలోచనలకూ, ఉనికికీ విలువ దక్కుతున్నట్టు. దీనికి కారణం నమ్మదగిన వ్యక్తిగా మీకున్న గుర్తింపు, అందుకోసం మీరు పడిన శ్రమ.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
This website follows the DNPA Code of Ethics.