
ప్రభుత్వ సేవలు ప్రజలకు సులభంగా అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. మంగళవారం సచివాలయంలో వివిధ శాఖల పనితీరుపై సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించారు.
వనమిత్రలో ఫిర్యాదులు చేసే అవకాశాన్ని ప్రజలకు కల్పించాలని సూచించారు. రాష్ర్టంలో మొబైల్ నెట్వర్క్ సమస్యలు లేకుండా చూడాలని కోరారు. ఈసందర్భంగా పలు అంశాలపైనా మాట్లాడి సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాలన్నారు. ప్రభుత్వ సేవలు సులభంగా అందించాలి : సీఎం చంద్రబాబు |