
హైదరాబాద్లోని సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ పేలుడు తీవ్ర కలకలం రేపింది. రోడ్ నంబర్-4లోని ఓ రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించింది.
హైదరాబాద్, జూన్ 30: నగరంలోని సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ పేలుడు తీవ్ర కలకలం రేపింది. రోడ్ నంబర్-4లోని ఓ రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఇంటి గోడలు, తలుపులు, కిటికీలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే ఈ పేలుడు ఎలా జరిగిందనేది మిస్టరీగా మారింది. ఇంట్లోని మూడు గ్యాస్ సిలిండర్లు, ఫ్రిజ్, గీజర్ పేలలేదని తేలింది. అలాగే అగ్నిప్రమాద ఆనవాళ్లు కూడా కనిపించలేదు. ఘటన సమయంలో కుటుంబసభ్యులు ఇంట్లోనే ఉన్నారు. వీరంతా ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు.
రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి దేవేందర్ తన భార్య, కుమారుడితో కలిసి గత 24 సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నారు. ఈరోజు(మంగళవారం) ఇంట్లోని వంటగదిలో ఒక్కసారిగా భారీ శబ్ధం వినిపించింది. పేలుడు ధాటికి ఇల్లు తీవ్రంగా దెబ్బతిన్నది. సమాచారం అందిన వెంటనే సరూర్నగర్ పోలీసులు, హైడ్రా సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. భారీ పేలుడుకి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కేసీఆర్ రైతు బాంధువుడు.. మీరు ఎప్పటికీ రైతు ద్రోహే: సీఎంపై కేటీఆర్ విమర్శలు
తెలంగాణను ఇబ్బంది పెట్టాలన్నదే కేంద్రం ఆలోచన: పొన్నం ప్రభాకర్
Read Latest Telangana News And Telugu News