
బూర్గంపహాడ్, జూన్ 30 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో మంగళవారం భారీగా గంజాయి పట్టుబడింది. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
ఛత్తీస్గఢ్ నుండి కంటైనర్ లారీలో భద్రాచలం మీదుగా గంజాయి తరలిస్తుండగా సారపాక గోదారమ్మ క్యాంప్ సమీపంలో అందిన సమాచారం మేరకు పోలీసులు కంటైనర్ లారీని తనిఖీ చేశారు. అందులో కోట్లాది రూపాయల గంజాయి ఉన్నట్లు గుర్తించి కంటైనర్ను స్వాధీనం చేసుకుని డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. గంజాయి తరలిస్తున్న కంటైనర్ లారీ ఉత్తరప్రదేశ్ కు వెళ్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు.