
కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ముంబయి(Mumbai)ని ముంచెత్తుతున్నాయి. వర్షాల ధాటికి నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలుచోట్ల రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో రహదారు
లు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై వరద నీటితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. నవీ ముంబయిలోని వ్యవసాయ మార్కెట్‌ను వాన నీరు ముంచెత్తింది. ఈ వార్త చదివారా: హల్దియా రిఫైనరీ పైప్‌లైన్‌లో అగ్ని ప్రమాదం.. 15 మందికి గాయాలు