
జమ్మూ కశ్మీర్లో పహల్గాం ఉగ్రదాడి కారణంగా పాకిస్థాన్‌కు సింధూ జలాలను భారత్ నిలిపివేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల భారత్‌తో యుద్ధానికి సిద్ధం అంటూ పాకిస్థాన్ స్పష్టం చేసింది.
తాజాగా ఈ అంశంపై పాకిస్థాన్ మరోసారి భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కింది.
ఇస్లామాబాద్, జూన్ 30: జమ్మూ కశ్మీర్లో పహల్గాం ఉగ్రదాడి కారణంగా పాకిస్థాన్‌కు సింధూ జలాలను భారత్ నిలిపివేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల భారత్‌తో యుద్ధానికి సిద్ధం అంటూ పాకిస్థాన్ స్పష్టం చేసింది. తాజాగా ఈ అంశంపై పాకిస్థాన్ మరోసారి భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కింది. ఈ సింధూ జలాలను నియంత్రిస్తున్న చేతులను ఇస్లామాబాద్ నరికి వేస్తుందంటూ ఆ దేశ వాతావరణ మార్పుల శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ తమ నీటి సరఫరాను నియంత్రించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
ఇస్లామాబాద్ నీటి హక్కులకు భంగం వాటిల్లితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని పాక్ మంత్రి హెచ్చరించారు. పొరుగు దేశ ప్రధాని నియంత్రణలో ఈ సింధూ జలాలు ఉన్నాయని పేర్కొన్నారు. పాకిస్థాన్‌కు ఒక్క నీటి చుక్కను కూడా ఇవ్వమని ఆయన ప్రకటించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. సోమవారం ఇస్లామాబాద్‌లో సమాచార శాఖ మంత్రి అత్తావుల్లా తారర్తో కలిసి నిర్వహించి విలేకర్ల సమావేశంలో మంత్రి ముసాదిక్ మాలిక్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు స్థానిక పత్రిక డాన్ మంగళవారం వెల్లడించింది.
2025, ఏప్రిల్ 22వ తేదీన పహల్గా్ం ఉగ్రదాడి 26 మంది మరణించారు. ఈ ఘటనకు తామే బాధ్యులమంటూ లష్కరే ఈ తోయిబా అనుబంధ సంస్థ ది రిసిస్టెంట్ ఫ్రెంట్(టీఆర్ఎఫ్) ప్రకటించింది. దీంతో పాకిస్థాన్‌పై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పహల్గాం ఘటన జరిగిన కొన్ని రోజులకే దశాబ్దాల నాటి సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. ఒక చోట నెత్తురు, నీరు ప్రవహించవని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని సింధూ జలాల ఒప్పందం నిలిపివేత సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ వివరించిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు పాకిస్థాన్ పటిష్టమైన చర్యలు తీసుకునే వరకు ఈ ఒప్పందం నిలిపి వేస్తామని ఈ సందర్భంగా భారత్ ప్రకటించిన విషయం విదితమే.
సింధూ జలాలు నిలిచిపోవడంతో పాకిస్థాన్ తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటుంది. దాదాపు 80 శాతం ఈ జలాలను వ్యవసాయానికి పాక్ వినియోగిస్తుంది. ఈ నీరు లేకపోవడంతో వ్యవసాయ రంగం ఆపదలో పడింది. ఈ నీరు లేక పోవడంతో తమ జాతీయ భద్రతకు ముప్పు వాటిలుతోందని అనిపించిన మరు క్షణమే.. భారత్‌పై యుద్ధానికి వెళ్తామని పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ జూన్ మొదటి వారంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
రెచ్చగొడితే సహించం.. అమెరికాకు ఇరాన్ అధ్యక్షుడి హెచ్చరిక..
For More International news And Telugu News