
సెప్టెంబర్ 19 నుంచి ఆసియా గేమ్స్ మహిళల జట్టును ప్రకటించిన బీసీసీఐ హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోనే బరిలోకి దిగనున్న భారత జట్టు Asian Games 2026 : మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో...
సెప్టెంబర్ 19 నుంచి ఆసియా గేమ్స్ మహిళల జట్టును ప్రకటించిన బీసీసీఐ హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోనే బరిలోకి దిగనున్న భారత జట్టు Asian Games 2026 : మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో టీమ్ఇండియా పేలవ ప్రదర్శన చేసింది. సెమీస్‌కు చేరకుండానే గ్రూప్ దశ నుంచే నిష్ర్కమించింది. అయినప్పటికి కూడా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) హర్మన్ ప్రీత్ కౌర్ పై నమ్మకాన్ని ఉంచింది. ఆసియా గేమ్స్‌లో కూడా హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోనే భారత జట్టు బరిలోకి దిగనుంది. జపాన్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు ఆసియా గేమ్స్ జరగనున్నాయి. ఈ మెగాటోర్నీలో పాల్గొనే భారత మహిళల జట్టును మంగళవారం బీసీసీఐ ప్రకటించింది. హర్మన్ నాయకత్వంలోనే భారత్ బరిలోకి దిగనుండగా వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధానను నియమించింది. Vaibhav Sooryavanshi : ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీని ఎందుకు ఆడించలేదు.. క్లారిటీ ఇచ్చిన కోచ్.. 🚨 News 🚨 India Women's squad announced for the 2026 #AsianGames in September. More Details ▶️ — BCCI Women (@BCCIWomen) June 30, 2026 దాదాపుగా టీ20 ప్రపంచకప్‌లో బరిలోకి దిగిన జట్టునే ఎంపిక చేశారు. వికెట్ కీపర్ యస్తికా భాటియాను తప్పించి ఆమె స్థానంలో కమిలిని ఎంపిక చేశారు. ఇక ప్రపంచకప్ టోర్నీ సమయంలో గాయపడిన శ్రేయాంక పాటిల్ ఆసియా గేమ్స్‌లో ఆడనుంది. అయితే.. ఈ టోర్నీకి ముందు ఆమె ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సి ఉంటుందని సెలక్టర్లు తెలిపారు. ఆసియా గేమ్స్‌కు భారత జట్టు ఇదే.. హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా గోష్, జి.కమిలిని, భారతి పుల్మాలి, శ్రీ చరణి, రేణుకా ఠాకూర్, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్, నందిని శర్మ,