
సోమవారం నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు మంగళవారం కూడా అదే బాటలో సాగుతున్నాయి. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి (94.61) బలహీనపడడం ప్రతికూలంగా మారింది.
సోమవారం నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు మంగళవారం కూడా అదే బాటలో సాగుతున్నాయి. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి (94.61) బలహీనపడడం ప్రతికూలంగా మారింది. అలాగే ఎల్‌నినో కారణంగా వర్షపాతం లోటు భారీగా ఉంటుందనే అంచనాలు కూడా నెగిటివ్‌గా మారాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కదలాడుతున్నాయి. అయితే బ్యాంక్ నిఫ్టీ మాత్రం లాభాల్లో ఉంది (Indian stock market).
గత సెషన్ ముగింపు (76,728)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం లాభాలతో మొదలైన సెన్సెక్స్ వెంటనే నష్టాల్లోకి జారుకుంది. ఒకదశలో దాదాపు 600 పాయింట్లు కోల్పోయింది. అయితే ఆ తర్వాత కాస్త కోలుకుంది. ఉదయం 10:00 గంటల సమయంలో సెన్సెక్స్ 170 పాయింట్ల నష్టంతో 76,558 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా అదే బాటలో సాగుతోంది. ప్రస్తుతం 60 పాయింట్ల నష్టంతో 23,885 వద్ద కదలాడుతోంది (stock market news today).
సెన్సెక్స్, నిఫ్టీలో భారత్ డైనమిక్స్, సమ్మన్ క్యాపిటల్, జీఎమ్ఆర్ ఎయిర్‌పోర్ట్స్, ఏబీ క్యాపిటల్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). ఎయిచర్ మోటార్స్, కేపీఐటీ టెక్, టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్, భారత్ ఫోర్జ్, నాల్కో మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 61 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 21 పాయింట్ల నష్టంతో ఉంది.
ఏరువాక పౌర్ణమి తెలంగాణ రైతుల సంస్కృతికి ప్రతీక: మంత్రి పొన్నం ప్రభాకర్
డూప్లికేట్ ఓట్లతోనే రేవంత్‌రెడ్డి గెలిచారని మా అనుమానం: కవిత