
కొత్త వాట్సాప్ అప్డేట్తో, ఇకపై మీ ఫోన్ నంబర్ తెలియజేయకుండానే కేవలం యూజర్ నేమ్ ద్వారా ఎవరితోనైనా చాట్ చేయవచ్చు.
మీకు ఇష్టం లేని పక్షంలో మీ ఫోన్ నంబర్ ఇతరులకు కనిపించదు, దీనివల్ల షేర్ చేయాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా మహిళల గోప్యతకు ఇది ఎంతో అవసరం.
మీరు మీ యాప్‌ను అప్డేట్ చేసుకున్న తర్వాత, సెట్టింగ్స్‌లోకి వెళ్లి 'అకౌంట్' క్లిక్ చేయాలి. అక్కడ 'యూజర్ నేమ్' ఆప్షన్ ద్వారా ఈ ఫీచర్ అందుబాటులో ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌కు మూడు బిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. అందరికీ ఒకేలా పేరు కేటాయించడం కష్టతరమైనందున, ముందే రిజర్వ్ చేసుకునే ప్రక్రియను వాట్సాప్ ప్రారంభించింది.
దీనివల్ల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ లాగా వాట్సాప్‌లో పబ్లిక్ సర్చ్ డైరెక్టరీ ఉండదు. కాబట్టి అపరిచితులు మీ యూజర్ నేమ్ కోసం వెతికి మిమ్మల్ని వేధించడం సాధ్యం కాదు. అవతలి వ్యక్తి వద్ద మీ యూజర్ నేమ్ ఖచ్చితంగా ఉంటేనే వారు మీకు మెసేజ్ చేయగలరు. భద్రతను మరింత పెంచడానికి కంపెనీ 'యూజర్ నేమ్' ఆప్షన్‌ను పరిచయం చేసింది.
ఇక్కడ మీరు మీకు నచ్చిన పేర్లను ముందుగానే రిజర్వ్ చేసుకోవచ్చు. వాట్సాప్ యాప్‌లోనే ఇంటర్నల్‌గా 'యూజర్ నేమ్ జనరేటర్' ఉంది, ఇది మీ పేరును పోలిన అనేక ప్రత్యేకమైన ఆప్షన్లను చూపిస్తుంది. వాటి నుండి మీరు ఎంపిక చేసుకోవచ్చు.
ఫోన్ నంబర్ లేకుండానే ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి వాట్సాప్ ఈ యూజర్ నేమ్ ఫీచర్‌ను తీసుకువచ్చింది. దీనిని X (ట్విట్టర్) వేదికగా కంపెనీ పోస్ట్ చేసింది. దీనికి కౌంటర్‌గా టెలిగ్రామ్, "మార్కెటింగ్‌లో తగ్గేదేలే" అంటూ 2014లోనే ఈ ఫీచర్‌ను తాము తెచ్చామని కామెంట్ చేసింది.
మీరు కూడా ఈ యూజర్ నేమ్ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ వెర్షన్లలో పొందాలంటే, యాప్ ఓపెన్ చేయగానే కొంతమందికి నోటిఫికేషన్ వస్తుంది. ఒకవేళ రాకపోతే, ప్రొఫైల్లోకి వెళ్లి 'క్రియేట్' లేదా 'రిజర్వ్ యూజర్ నేమ్' ఆప్షన్ చూడవచ్చు.
ఇంకా ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి రాలేని ప్రాంతాల్లో ఈ ఆప్షన్ కనిపించదు. అతి త్వరలో అప్డేట్ అవుతుంది. మీరు ఇక్కడ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్స్ కూడా ఈ వాట్సాప్‌లో వాడుకునే సౌకర్యం కూడా ఉంటుంది.