.webp&w=3840&q=75)
బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఒక కన్నతల్లే వారిని దారుణంగా హత్య చేసి ఆ తరువాత తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన శ్రీకాకుళం జిల్లా వెదుళ్లవలసలో వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి.
వెదుళ్లవలస గ్రామానికి చెందిన కుర్మారపు వరలక్ష్మి అనే మహిళ తన ఇద్దరు కన్నబిడ్డల కుత్తుకలను కోసి హత్య చేసి.. ఈ తరువాత అదే కత్తితో తన గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
సమాచారం అందుకుని ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వరలక్ష్మిని శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి (రిమ్స్) తరలించారు. ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ఆస్పత్రివర్గాలు తెలిపాయి. కన్నతల్లే ఇంతటి ఘోరానికి ఎందుకు ఒడిగట్టింది? ఆ ఇద్దరు పసిపిల్లల ప్రాణాలు తీయడానికి దారితీసిన బలమైన కారణాలు ఏంటి? కుటుంబ కలహాలా లేక మానసిక ఒత్తిడి కారణమా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందానికి తుది గడువుజులై 15!
.