
కశ్మీరీ పండిట్ సామాజిక వర్గానికి చెందిన నర్స్ సరళా భట్ అపహరణ, హత్య కేసు 35 ఏళ్ల తర్వాత కీలక మలుపు తిరిగింది. జమ్మూకశ్మీర్ స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎస్ఏఐ) ఈ ఘటనపై దర్యాప్తును ముగించి,...
కశ్మీరీ పండిట్ సామాజిక వర్గానికి చెందిన నర్స్ సరళా భట్ అపహరణ, హత్య కేసు 35 ఏళ్ల తర్వాత కీలక మలుపు తిరిగింది. జమ్మూకశ్మీర్ స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎస్ఏఐ) ఈ ఘటనపై దర్యాప్తును ముగించి, జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) చీఫ్ మహ్మద్ యాసిన్ మాలిక్‌తో పాటు మరికొందరిని నిందితులుగా చేరుస్తూ శ్రీనగర్‌లోని ప్రత్యేక కోర్టులో 737 పేజీల భారీ ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేయడానికి సిద్ధమైంది. లోయలో ఉగ్రవాదం తీవ్రస్థాయిలో ఉన్న కాలంలో జరిగిన ఈ ఘోరానికి సంబంధించిన దర్యాప్తులో ఇన్నాళ్లకు ఒక పెద్ద పురోగతి లభించింది.ఈ కేసు వివరాల్లోకి వెళితే.. 1990 ఏప్రిల్ 18న శ్రీనగర్‌లోని షేర్-ఇ-కశ్మీర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎస్‌కేఐఎంఎస్) సమీపంలో నర్స్ సరళా భట్‌ను ఉగ్రవాదులు అపహరించారు. ఆ తర్వాత ఆమెను శారీరక హింసకు గురిచేసి, శ్రీనగర్ మాల్బాగ్లోని ఒమర్ కాలనీలో ఆటోమేటిక్ రైఫిల్స్‌తో కాల్చి అతి క్రూరంగా హత్య చేశారు. అప్పట్లో ఉగ్రవాద సంస్థలు సృష్టించిన బీభత్సం, భయాందోళనల కారణంగా సాక్షులు ఎవరూ ముందుకు రాకపోవడంతో దశాబ్దాలుగా ఈ కేసు ఒక మిస్టరీగానే ఉండిపోయింది.అయితే, 2024 మార్చి 18న జమ్మూకశ్మీర్ డీజీపీ ఆదేశాల మేరకు ఈ కేసు ఎస్ఐఏ చేతుల్లోకి వచ్చింది. 35 ఏళ్లు గడిచినప్పటికీ, దర్యాప్తు అధికారులు ఎంతో శ్రమించి సాంకేతికంగా, శాస్త్రీయంగా ఆధారాలను సేకరించారు. సాక్షుల వాంగ్మూలాలు, స్వతంత్ర ప్రత్యక్ష సాక్షుల ఆధారాలు, ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా నాటి ఘటన క్రమాన్ని విజయవంతంగా పునర్నిర్మించారు.ఈ దర్యాప్తులో తేలిందేంటంటే.. సరళా భట్ హత్య అనేది ఏదో