
అమెరికాతో కుదిరిన అవగాహన ఒప్పందాన్ని(ఎంఓయూ) తాము గౌరవిస్తామని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ స్పష్టం చేశారు. అయితే, అగ్రరాజ్యం బెదిరింపులు, రెచ్చగొట్టే చర్యలు కొనసాగితే మాత్రం తగిన విధంగా స్పంది
స్తామని ఆయన హెచ్చరించారు.
టెహ్రాన్: అమెరికాతో కుదిరిన అవగాహన ఒప్పందాన్ని(ఎంఓయూ) తాము గౌరవిస్తామని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ స్పష్టం చేశారు. అయితే, అగ్రరాజ్యం బెదిరింపులు, రెచ్చగొట్టే చర్యలు కొనసాగితే మాత్రం తగిన విధంగా స్పందిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ విషయంలో ఏమాత్రం వెనుకాడబోమని తేల్చి చెప్పారు. అమెరికా ఒత్తిళ్లకు లొంగబోమని, దేశ గౌరవాన్ని కాపాడే విధానాన్నే అనుసరిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా పెజెష్కియాన్ పోస్టు పెట్టారు.
'పరస్పర అవగాహన అనేది రెండు వైపులా ఉండాలి. అమెరికా ఒప్పందానికి కట్టుబడి ఉంటే, మేమూ మా బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తాం. అసంబద్ధమైన యుద్ధోన్మాద వ్యాఖ్యలు, నిరాధార బెదిరింపుల విషయంలో హేతుబద్ధతతో నిర్ణయాలు తీసుకుంటాం. కానీ చర్య తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే మాత్రం ధైర్యంగా, దృఢంగా దేశాన్ని రక్షిస్తాం' అని పెజెష్కియాన్ ఎక్స్‌లో స్పష్టం చేశారు.
ఈ వ్యాఖ్యలు అమెరికా-ఇరాన్ మధ్య ఇటీవల కుదిరిన అవగాహన ఒప్పందం అమలుపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జూన్ 17, 18 తేదీల్లో కుదిరిన ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం ప్రకారం లెబనాన్‌లో సైనిక చర్యలను నిలిపివేయడం, హోర్ముజ్ జలసంధిని కనీసం 60 రోజుల పాటు పూర్తిగా తెరిచి ఉంచడం, యురేనియం నిల్వల అంశంపై చర్చల ద్వారా పరిష్కారం వంటి అంశాలపై ఇరు దేశాలు అంగీకరించాయి. అయితే ఒప్పందం కుదిరిన కొన్ని రోజులకే ఇరుదేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి.
లెబనాన్‌లో ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరగడంతో ఇరాన్ తాత్కాలికంగా హోర్ముజ్ జలసంధిని మూసివేయడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. మరోవైపు ఇరాన్ అణు కేంద్రాలను ఐక్యరాజ్యసమితి పరిశీలకులు తనిఖీ చేయడానికి టెహ్రాన్ అంగీకరించిందా, లేదా? అనే విషయంలో అమెరికా, ఇరాన్ పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశాయి. ఈ నేపథ్యంలో పెజెష్కియాన్ తాజా వ్యాఖ్యలు ఇరాన్ ప్రజలకు భరోసా కల్పిస్తూనే, అమెరికాకు స్పష్టమైన సంకేతాలు పంపినట్లయ్యింది.
నేడు దోహాలో చర్చలు.. ఇరాన్ వేడుకుందన్న ట్రంప్