సుందరి పెళ్లి పనుల గురించి రంగా, కామాక్షి మాట్లాడతారు. పెళ్లి కొడుకు తరుపున మేనమామ ఇక్కడే మటన్ కొట్టులో ఉంటాడట.. ఆయనే అన్ని పనులు చూసుకుంటాడట అని రంగా అంటాడు.
అంటే మన రోహిణికి ఉన్నట్టుగానే పెళ్లి కొడుక్కి కూడా మేక మామ ఉన్నాడా? కానీ ఇంత వరకు కలిసింది లేదు అని బాలు కౌంటర్లు వేస్తాడు. పెళ్లి కూతురు తరుపున నువ్వు, పెళ్లి కొడుకు తరుపున అతను పనులు చూసుకుంటున్నారు.. పెళ్లిలో కలవొచ్చు లే అని రంగా అంటాడు. ఇంకో వైపు మనోజ్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఓవర్ చేస్తుంటాడు. నేను ఒక పెద్ద బిజినెస్ మెన్ని, బిజీగా ఉంటా.. నేను ఇచ్చిన కంప్లైంట్ గురించి పట్టించుకోవడం లేదు.. నేను వస్తే కూడా పట్టించుకోవడం లేదు అని కానిస్టేబుల్ వద్దకు వెళ్లి అతి చేస్తాడు మనోజ్. ఆ రోజు మేం ఇచ్చింది నీకు సరిపోలేదా? అని కానిస్టేబుల్ అంటాడు. మీ పై వాళ్లకి కంప్లైంట్ చేస్తా అని మనోజ్ అంటే.. ఢిల్లీకి వెళ్లి అక్కడ చెప్పుకో అని అంటాడు కానిస్టేబుల్. ఇక బయటకు వెళ్లే టైంలో ఇంకో కానిస్టేబుల్ వచ్చి మనోజ్‌ని కొడతాడు. ఆ రోజు మా వాడి చెవిలో ఏదో చెప్పావ్ అంట కదా అని కొడతాడు. దీంతో మనోజ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.మూడు రోజులు సస్పెండ్.. మనం రూల్స్ పాటించాలి.. పబ్లిక్ చేత రూల్స్ పాటించేలా చేయాలి.. వాళ్లు రూల్స్ పాటించకపోతే ఫైన్స్ వేస్తాం.. మరి మనం రూల్స్ పాటించకపోతే ఎలా అని అరుణ్‌ను ఎస్సై మందలిస్తాడు. నీ మీద ఎవడో బాగానే కక్ష పెట్టుకున్నాడు.. అందుకే ఆ వీడియో తీసి వైరల్ చేశాడు.. విషయం కమీషనర్ దగ్గరకు వెళ్లింది.. మూడు రోజులు సస్పెండ్ చేశాడు.. కాస్త జాగ్రత్తగా ఉండు అని ఎస్సై తిడతాడు. వాడు ఎవడో నాకు తెలుసు సార్.. వాడికి ఫైన్ వేశానని ఇలా చేశాడు అని అరుణ్ అంటాడు. వాడ్ని వదిలిపెట్టను రా అని అరుణ్ తన ఫ్రెండ్‌తో చెప్పి రగిలిపోతుంటాడు.మరో సలహా ఇచ్చిన మీనా.. ఫోన్ తీసుకున్నా.. అందులో ఏం లేదు. నాకేం అర్థం కావడం లేదు.. ఇంకా ఏదైనా సలహా ఇవ్వు అని మీనాని విద్య అడుగుతుంది. సరే ఈ సారి ఓ కాగితం తీసుకో.. అందులో నీకు నచ్చిన పది విషయాల్ని రాయి.. అతడ్ని కూడా రాయమను.. అందులో కనీసం సగం అయినా మ్యాచ్ అయితే ముందుకు వెళ్లు. పరిచయం పెంచుకో.. అప్పుడు మిగతావన్నీ తెలుస్తాయి.. అని సలహా ఇస్తుంది మీనా. ఈ ఇద్దరూ ఇలా క్లోజ్‌గా మాట్లాడుతూ ఉంటే దూరం నుంచి రోహిణి చూసి కుళ్లుకుంటుంది. వామ్మో ఏం మాట్లాడుకుంటున్నారో అని అనుకుంటుంది.రోహిణితో చెప్పని విద్య.. అబ్బో.. ఈ మధ్య మీనాతో ఫ్రెండ్ షిప్ ఎక్కువ అయిందే.. అంత సీరియస్‌గా ఏం మాట్లాడుకుంటున్నారు అని రోహిణి అంటుంది. పర్సనల్.. సీక్రెట్.. ఇప్పుడే చెప్పను అని అంటుంది విద్య. ఏదో దాచి పెడుతున్నావ్.. ఎవరి మీద ఇష్టం పెరిగినట్టు కనిపిస్తోంది.. అని రోహిణి అంటుంది. నేను ఇంకా ఏదీ కన్ఫామ్ చేసుకోలేదు.. తర్వాత చెబుతాను అని విద్య అంటుంది. ఇప్పుడు చెప్పొచ్చు కదా అని రోహిణి అడుగుతుంది. లేదు తర్వాతే చెప్తాను అని విద్య అంటుంది. సరే పదా.. ఆకలి అవుతోంది.. బయటకు వెళ్లి తిందామని రోహిణి అంటుంది.అరుణ్ ఇంటికి సుమతి.. మెడిసిన్స్ ఇచ్చేందుకు అరుణ్ ఇంటికి సుమతి వెళ్తుంది. రాజేశ్వరి అక్కడ సుమతిని చూసి సంబరపడుతుంది. తిన్నారా? అని సుమతి అడిగితే.. ఆఫీసు నుంచి డల్ గా వచ్చి లోపలే ఉండిపోయాడు అని అరుణ్ గురించి చెబుతుంది. దీంతో అరుణ్ హాల్లోకి వస్తాడు.. సుమతికి ఏదో తేడా కొడుతుంది. విషయం అడగ్గా.. జరిగిందంతా చెబుతాడు అరుణ్. మీ పరిస్థితి గురించి తెలీక అలా చేసి ఉంటాడు.. అయినా మూడు రోజులే కదా.. అలా జీవితాంతం సస్పెన్షన్ జరిగినట్టు ఎందుకు డల్‌గా ఉన్నారు అని సుమతి అడుగుతుంది.అరుణ్‌ను కూల్ చేసిన సుమతి.. చెప్పే వాళ్లకి ఈజీగానే ఉంటుంది లే అని అరుణ్ అంటాడు. అలా కాదు.. మీకు ఇది కూడా మంచికే జరిగింది.. మీరు ఎప్పుడూ బిజీ.. అడిగినా లీవ్స్ దొరకవు.. ఇలా టైం దొరికిందని అనుకోండి.. అమ్మతో హాయిగా ఉండండి.. పెండింగ్‌లో ఉన్న పనుల్ని ఫినిష్ చేసుకోండి.. అమ్మతో కలిసి సరదాగా తిరగండి.. అమ్మకి ప్రేమను పంచండి అని సుమతి చెబుతుంది. అవును నేను ఈ యాంగిల్లో ఆలోచించనే లేదు అని అరుణ్ అంటాడు. ముందు భోజనం చేయండి అని సుమతి అంటుంది. నువ్వు కూడా రా అమ్మా అని రాజేశ్వరి అడుగుతుంది. నేను తినేసి వచ్చానని సుమతి చెబుతుంది.బాలుని మందలించిన మీనా.. ఏదో ఘన కార్యం చేసి, విజయం సాధించాను అని వచ్చి చెబుతాడు బాలు. స్వీట్ చేయమని మీనాని అడుగుతాడు. ఏం చేశారు అని మీనా అడుగుతుంది. జరిగిందంతా చెబుతాడు బాలు. ఆయన రూల్స్ పాటిస్తాడు.. అలా చేశాడు అంటే..ఏదో పెద్ద కారణమే ఉండి ఉంటుంది.. హాస్పిటల్లో ఎవరికైనా ఎమర్జెన్సీ అయి ఉంటుంది.. అలాంటప్పుడు వీడియో తీసి ఇలా చేస్తారా? ఇది తప్పు కదా.. అని బాలుని మందలిస్తుంది మీనా. రూల్స్ ఎవరికైనా ఒకటే కదా.. ఆ రోజు కూడా నాది ఎమర్జెన్సీ అని చెప్తే వదిలేశాడా? లేదు కదా.. అని బాలు అంటాడు.మీరు చేసింది తప్పు.. అతను అతని డ్యూటీని చేశాడు.. మీరు ఇప్పుడు చేసిన ఈ కంపు ఏంటి? అని మీనా నిలదీస్తుంది. నేను పౌరుడిగా డ్యూటీ చేశాను.. రూల్స్ ఎవరికైనా ఒకటే అని నిరూపించాను అని బాలు అంటాడు. అక్కడ ఉన్న వారంతా కూడా నేను చేసింది రైటే అని అన్నారు అని బాలు చెబుతాడు. వారికి కూడా ఎప్పుడో ఫైన్ పడి ఉంటుంది.. అందుకే అలా అన్నారేమో అని మీనా అంటుంది. మీకు అతను చేసింది తప్పులా కనిపిస్తే.. నాకు మీరు చేసింది తప్పులా కనిపిస్తోంది అని మీనా అంటుంది.తప్పు చేస్తే తప్పు అని చెప్పేది మంచి భార్య.. ఇంకా నయం మీరు స్వీట్ చేయమని అనగానే.. నేను చేయలేదు.. చేసి ఉంటే.. ఆ పాపంలో పాలు పంచుకున్నట్టు అయ్యేది.. ఒకరి పొట్ట కొట్టి.. ఒకరి ఉద్యోగం ఊడకొట్టి మనం స్వీట్ చేసుకుని తినేంత పైశాచికత్వం నాకు లేదు.. అని మీనా అంటుంది. అంటే ఏంటి ఇప్పుడు నేను చేసింది తప్పు.. అతను చేసింది ఒప్పు అంటావా? అని బాలు అంటాడు. అవును.. తప్పు చేస్తే తప్పు అని చెప్పేది మంచి భార్య.. నేను రోహిణిని కాదు.. మంచి భార్యని.. మీరు కూడా మనోజ్ కాదు.. బాలు.. నా భర్త బాలు.. మీరు ఎప్పటికీ తప్పు చేయకూడదు అని అనుకుంటాను అని అంటుంది మీనా.డ్రైవింగ్ స్కూల్ ప్రమోషన్స్.. ఆ తర్వాత మీనాకి డ్రైవింగ్ నేర్పిస్తుంటాడు బాలు. మధ్యలో శ్రుతి కనిపిస్తే కారు ఆపుతుంది మీనా. మీ ఇద్దరినీ ఇలా చూస్తుంటే బాగుందని ఫోటోలు తీస్తుంది. భార్యకు డ్రైవింగ్ నేర్పిస్తున్న భర్త అని క్యాప్షన్ పెట్టి సోషల్ మీడియాలో షేర్ చేస్తా.. అది మీ డ్రైవింగ్ స్కూల్ ప్రమోషన్స్‌కి పనికి వస్తుందని శ్రుతి అంటుంది. సరే అయితే పెట్టు అని బాలు, మీనా పోజులు ఇస్తారు. ఇక మీనాకి డ్రైవింగ్ ఎలా చేయాలో చెబుతుంటాడు బాలు. ప్రేమగా చెబితే నేర్చుకుంటా.. అలా చిరాగ్గా చెప్తే రాదు అని మీనా అంటుంది.ప్రభావతి దెబ్బకు పని చేయని మిషన్.. డ్యాన్స్ స్కూల్లో వెయింగ్ మిషీన్‌ను ప్రేమ జంట తీసుకు వస్తుంది. వెయిట్ చూసుకుంటూ ఫిట్‌గా ఉండాలని ఇది తీసుకు వచ్చానని చెబుతాడు. దీంతో కామాక్షి, చింతామణి తమ తమ వెయిట్లను చూసుకుంటారు. ప్రభావతి వెయిట్ చూసే టైంకి అది పని చేయదు.. అంత బరువు ఉంటే అది పని చేయదు అని కామాక్షి కౌంటర్లు వేస్తుంది. దీంతో అందరూ నవ్వేస్తారు. ఇంత వరకు బాగానే పని చేసింది.. మీరు ఎక్కాకే పని చేయడం లేదు అని పిల్లలు కూడా అంటారు. దీంతో మళ్లీ అందరూ నవ్వేస్తారు.రెచ్చగొట్టిన చింతామణి.. బరువు ఎక్కువయ్యాను.. తగ్గించాలని కామాక్షి అంటుంది. నేను తల్చుకుంటే మూడు నెలల్లోనే తగ్గేస్తా అని ఓవర్ చేస్తుంది ప్రభావతి. మరి తగ్గండి చూద్దాం అని చింతామణి రెచ్చగొడుతుంది. ఇంటి మీద కంట్రోల్ లేని వాళ్లకి.. ఒంటి మీద ఏం కంట్రోల్ ఉంటుంది.. మీ కోడళ్లు మీరు చెప్పినట్టుగా వింటారా? ఆ మీనా వింటుందా? మీరు ఆపమంటే అన్నీ ఆపేస్తుందా? అని ఇలా ప్రభావతిని రెచ్చగొడుతుంది చింతామణి. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది. 🔹‘పొదరిల్లు’ టుడే ఎపిసోడ్ : సూదులు గుచ్చినట్టుగా మాట్లాడిన బస్తీవాసులు.. మంట పెట్టిన తాయారు.. మహా మనసు మారుతుందా?