
ఇంటర్నెట్ డెస్క్: అగ్ర కథానాయిక సమంత తల్లి కానున్న విషయం తెలిసిందే. ‘మా ఇంటి బంగారం’ థాంక్స్ మీట్లో ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించి ఆమె.. కొన్ని రోజులు విరామం తీసుకోనున్నట్లు తెలిపారు.
అయితే, ఈ సినిమా షూటింగ్ సమయంలో సమంత (Samantha) ఈ గుడ్‌న్యూస్ తనకు చెప్పారని.. ఎవరికీ చెప్పొద్దన్నారని దర్శకురాలు నందినిరెడ్డి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
‘‘9 గంటలకు షూట్ ప్రారంభమవుతుందంటే సమంత కచ్చితంగా ఆ సమయానికి సెట్లో ఉంటారు. ఈ చిత్రంలో తస్సాదియా సాంగ్ షూటింగ్ అప్పుడు సమంతకు జ్వరం వచ్చిందని 11.30కు వస్తారని అన్నారు. నాకేమో టెన్షన్.. మొదట ఈ పాట 4 రోజులు చేయాలని అనుకున్నాం. షెడ్యూల్ కారణంగా రెండు రోజులకు కుదించాల్సి వచ్చింది. ఒకవైపు సామ్ హెల్త్ బాలేదు.. ఎలా పూర్తవుతుందా అని టెన్షన్ పడ్డాను. చెప్పినట్లే 11.30కు వచ్చి షూట్ కంప్లీట్ కాగానే వెళ్లిపోయింది. మళ్లీ రెండోరోజు రాగానే జ్వరం తగ్గిందా.. ఎందుకు అలా తరచూ వస్తోంది అని అడిగాను. ‘జ్వరం కాదు.. నేను ప్రెగ్నెంట్‌ని. ఈ విషయం ఎవరికీ చెప్పకు’ అని సమంత చెప్పింది. నాకు చాలా ఆనందం వేసింది’’
‘‘సమంత నాకు ఆ మాట చెప్పగానే డ్యాన్స్ మాస్టర్ దగ్గరకు వెళ్లి ఆమెకు ఆరోగ్యం బాలేదు. తనతో ఎక్కువ రిహార్సల్స్ చేయించొద్దు అని చెప్పాను. చిన్నచిన్న స్టెప్స్‌తో కంటిన్యూ చేద్దామని చెప్పా. సమంత మార్నింగ్ సిక్నెస్తోనే ఆ పాట పూర్తి చేసింది. కార్ యాక్సిడెంట్ సీన్, ఛేజింగ్ సన్నివేశం కూడా తర్వాత షూట్ చేసినవే. చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. 3.30 తర్వాత నీడలో షూట్ చేశాం. ఆమె ఎక్కువ ఒత్తిడికి గురికాకుండా చూసుకున్నాం’’ అని నందినిరెడ్డి చెప్పారు. సమంతను బెస్ట్‌గా చూపించాలనే ఏకైక ఉద్దేశంతోనే ఈ చిత్ర బృందమంతా వర్క్ చేసినట్లు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.