తేజస్వీ చేస్తున్న ‘ కాకమ్మ కథలు ’ షో ఆహాలో బాగానే క్లిక్ అయింది. వస్తున్న గెస్టులు, వారు బోల్డ్‌గా చెబుతున్న విషయాలు ఆహా ఓటీటీ ఆడియెన్స్‌ని మెప్పిస్తున్నాయి. అందుకే ఈ షోని కంటిన్యూ చేస్తున్నారు.
ఇన్ ఫ్లూయెన్సర్ మౌనీషా .. ఈషా బ్లాగ్స్గా ఇన్ స్టాలో సుపరిచితురాలు.. ఇక ఈ తేజు హోస్ట్ చేస్తున్న ఈ షోలో తాజాగా ఈమె సందడి చేశారు. ఆమెతో పాటుగా ఢీ డ్యాన్సర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ నైనిక పాల్గొన్నారు. ఇక వీరిద్దరూ చెప్పిన విశేషాలు, మాట్లాడిన మాటలు ఈ ప్రోమోలో హైలెట్ అవుతున్నాయి.ఈ షోలో ఫస్ట్ రౌండ్ పేరే వింతగా ఉంటుంది. ఆశకి హద్దు ఉండాలి అనే ఈ ఫస్ట్ రౌండ్లో తేజ తన ట్యాబ్‌లో హీరో ఫోటోలను స్క్రోల్ చేస్తుంటుంది. కళ్లు మూసుకుని ఉన్న గెస్ట్ ఏదో ఒక చోట స్టాప్ అని అంటుంది. అలా స్టాప్ అన్నప్పుడు తేజు కూడా స్క్రోల్ చేయడం ఆపేస్తుంది. అలా వచ్చిన హీరో గురించి, అతనితో ఉండే ఫ్యాంటసీ గురించి ఇలా ఏదో ఒకటి చెప్పాల్సి ఉంటుంది. ఇక మౌనీషాకి సందీప్ కిషన్ వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఒక రాత్రి.. ధడేల్ అని ఈషా అంటుంది. అంతలో తేజు, నైనిక పగలబడి నవ్వేస్తారు. ధడేల్ మని స్నో పడుతుంది.. అని ఈషా కవర్ చేస్తుంది.ఈ స్నోకి నీ జుట్టంతా చెడిపోతుంది.. అలా పక్కన గడ్డివాము ఉంది.. రా అని పిలిచాడు అని ఓ కథ అల్లి చెబుతుంది ఈషా. అబ్బో ఇంకేం ఉన్నాయి అని అంటుంది తేజు. రౌండ్స్ అని ఈషా అనడంతో మళ్లీ నైనిక, తేజు ఎగిరెగిరి నవ్వుతారు. మీరు అనుకునే రౌండ్స్ కాదు అని ఈషా మళ్లీ కవర్ చేస్తుంది. మేం ఏం అనుకోలేదే అని నైనిక అంటుంది. నాకు తెలుసు.. మీరు అనుకుంటారు.. మీవి బూతు బుర్రలు అని తెలుసు అని ఈషా అంటుంది. అలా ఈషా తన వంతు పూర్తి చేస్తుంది.ఇక నైనికకు సిద్దు జొన్నలగడ్డ వస్తాడు. మంచు కొండల్లో బూం బూం చేస్తూ, రీల్స్ చేస్తూ అని నైనిక ఏదో చెబుతుంది. అక్కడి వరకు వెళ్లి చెడగొట్టాలా? అని తేజు నవ్వేస్తుంది. ఇదే షోలో నైనిక తన అబ్యూజివ్ రిలేషన్ గురించి చెప్పింది. ఎన్నో సార్లు తనని తాను గాయపర్చుకున్నానని, చనిపోవాలని అనుకున్నానని నైనిక చెప్పుకొచ్చింది. ఈషా తన వ్యక్తిగత జీవితం గురించి చెబుతూ.. తనకి పెళ్లి అయిందని, కరోనా టైంలో తన కొడుకు చనిపోయాడు అంటూ చెప్పి అందరినీ ఏడ్పించేసింది.