
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Kondagattu Giri Pradakshina: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న సన్నిధిలో వచ్చే నెలలో అత్యంత వైభవంగా నిర్వహించబోతున్న గిరి ప్రదక్షిణ మహోత్సవానికి సంబంధించి నిర్వాహకులు ఒక వినూత్నమైన, పర్యావరణహితమైన పిలుపునిచ్చారు. ఈ గిరి ప్రదక్షణకు తరలివచ్చే భక్తులందరూ ఆధ్యాత్మిక భక్తి భావనతో పాటు పర్యావరణ స్పృహను చాటుకుంటూ ఒక్కొక్కరు కచ్చితంగా 108 సీడ్స్ బాల్స్ తీసుకురావాలని ఓ స్వామీజీ కోరారు.. ఈ మేరకు కొండగట్టు పరిసరాలలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన భక్తులందరితో ఘనంగా ప్రతిజ్ఞ చేయించారు..
కొండగట్టు అనగానే స్వామి వారితో పాటు అక్కడ భారీ సంఖ్యలో ఉండే కోతులు అందరికీ గుర్తుకు వస్తూ ఉంటాయి. రోజురోజుకు అడవులు తగ్గిపోవడంతో పాటు కొండలపై సరైన ఆహార వనరులు లేకపోవడం వల్ల ఈ కోతులు ఆహారం కోసం తరచుగా భక్తులపై, స్థానిక గ్రామాలపై పడుతూ ఉన్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సంకల్పంతో ఈ సీడ్స్ బాల్స్ ప్రచారాన్ని చేపట్టారు. భక్తులు తమ ఇళ్ల వద్దనే మట్టితో పాటు పీడ మిశ్రమంతో దానిమ్మ, బొప్పాయి, జామ పండు, సీతాఫలం వంటి తదితర పండ్ల గింజలను ఉపయోగించి ఈ సీడ్స్ బాల్స్ తయారు చేసుకొని తీసుకురావాలని సూచించారు.
గిరి ప్రదక్షణ చేసే సమయంలో భక్తులందరూ తాము తెచ్చిన 108 సీడ్స్ బాల్సును కొండగట్టు చుట్టూ ఉన్న గుట్టతో పాటు ఖాళీ ప్రదేశాలు, అడవి ప్రాంతాల్లో చల్లాలని కోరారు.. రాబోయే వర్షాకాలంలో ఈ విత్తనపు బంతులు నాని.. మొలకెత్తి కొద్ది రోజుల్లోనే పచ్చని పండ్ల వృక్షాలుగా మారుతాయి అని వివరించారు. దీనివల్ల కొండపై పచ్చదనం పెరగడమే కాకుండా భవిష్యత్తులో కోతులకు అడవుల్లోనే పుష్కలంగా ఆహారం లభిస్తుందని.. తద్వారా అవి జనావాసాల్లోకి రాకుండా ఉంటాయని తెలిపారు.
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
ఈ వినూత్న కార్యక్రమానికి అంజన్న భక్తుల నుంచి ప్రకృతి ప్రేమికుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. వచ్చే నెలలో జరిగే గిరి ప్రదక్షిణను విజయవంతం చేయడంతో పాటు కొండగట్టును హరితవనంగా మార్చేందుకు ప్రతి ఒక్కరు తామవంతుగా 108 సీట్స్ బాల్స్ ను తయారుచేసుకు రావాలని నిర్వాహక కమిటీ భక్తులకు విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా కొండపైకి వచ్చే భక్తులు కూడా ఈ బాల్స్ ను తీసుకొని వచ్చి వివిధ ప్రదేశాల్లో చల్లడం మంచిదని వారి తెలిపారు. ఇలా చేయడం వల్ల చాలా మేలు జరిగే అవకాశాలు ఉన్నాయని వారు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.