
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ క్రికెట్లో ఐర్లాండ్ అద్భుతం చేసింది. తొలిసారి టీమ్ఇండియాపై టీ20 సిరీస్‌ను (india vs Ireland Series) కైవసం చేసుకుంది.
ఇంతవరకూ ఎప్పుడూ వరుసగా రెండు మ్యాచుల్లో గెలవని ఐర్లాండ్ చరిత్ర సృష్టించింది. దీని వెనుక హెన్రిచ్ మలన్దే కీలక పాత్ర. ఈ క్రమంలో అభిమానులకు షాక్ ఇస్తూ కీలక నిర్ణయం తీసుకున్నాడు. కోచింగ్ బాధ్యతల నుంచి వైదొలిగాడు. ఈ మేరకు ఐర్లాండ్ క్రికెట్ కొత్త ప్రధాన కోచ్‌గా గ్యారీ విల్సన్‌ను నియమిస్తూ క్రికెట్ బోర్డు ప్రకటన చేసింది. వచ్చే ఏడాది వన్డే ప్రపంచ కప్ కోసం జట్టు అతడి నేతృత్వంలో సిద్ధం కానుంది.
ఐర్లాండ్‌కు 2022లో మలన్ (Heinrich Malan) ప్రధాన కోచ్‌గా వచ్చాడు. 45 ఏళ్ల ఈ దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఇవాళ ఉదయమే ఐర్లాండ్ మేనేజ్మెంట్కు తన నిర్ణయాన్ని వెల్లడించడం గమనార్హం. 2027 త్రైమాసికం వరకు మలన్ పదవీకాలం ఉంది. అయితే, ఇప్పుడు భారత్‌పై విజయం సాధించడంతో.. వైదొలిగేందుకు ఇదే మంచి తరుణమని మలన్ భావించాడు. వచ్చే ప్రపంచ కప్ కోసం జట్టును సన్నద్ధం చేసేందుకు కొత్త కోచ్‌కూ సమయం ఉంటుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. అఫ్గానిస్థాన్‌తో ఆగస్ట్‌లో వన్డే సిరీస్‌ను ఐర్లాండ్ ఆడనుంది. అప్పట్నుంచి కోచింగ్ బాధ్యతలను విల్సన్ తీసుకుంటాడని బోర్డు ఓప్రకటనలో తెలిపింది.
‘‘ఐర్లాండ్ కోచ్‌గా పనిచేయడం గర్వంగా భావిస్తున్నా. జట్టులోని ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, ఐరిష్ క్రికెట్ కమ్యూనిటీతో మంచి సంబంధాలు ఉన్నాయి. టీ20 ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్‌పై విజయం సాధించడం ఎప్పటికీ మరిచిపోలేం. అబుదాబిలో అఫ్గాన్‌పై ఏకైక తొలి టెస్టులో గెలవడం.. స్వదేశంలో జింబాబ్వేపై టెస్టు విజయం ఎప్పటికీ మరిచిపోలేను. ఇక ఇండియా, పాకిస్థాన్, విండీస్, దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్‌లను సొంతం చేసుకున్నాం. టీ20 ప్రపంచ కప్‌లకు నేరుగా అర్హత సాధించాం. నిలకడైన ఆటతీరుతో ప్రపంచ ఛాంపియన్లనే ఓడించాం’’ అని మలన్ (Heinrich Malan) తెలిపాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
ఉప్పల్: టీజీ20 లీగ్ 2026లో భాగంగా పాలమూరు స్ట్రైకర్స్, నల్గొండ నైట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాలమూరు తొమ్మిది వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ప్రజ్ఞయ్ రెడ్డి (55), బుడిది తేజ (50) హాఫ్ సెంచరీలు సాధించారు. ఈ మ్యాచ్ ఫొటోలు మీ కోసం..
ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ 2026 ఎడిషన్ నాకౌట్ స్టేజ్‌కు చేరుకుంది. లీగ్ దశలో తలపడిన 48 జట్లలో ఇప్పటికే 16 ఇంటిముఖం పట్టాయి. రౌండ్ 32 నుంచి క్వార్టర్స్‌కు మరో పదహారు జట్లు చేరతాయి. ఇప్పటి వరకు మ్యాచులను అభిమానులు ఆసక్తిగా తిలకించారు. ఆ ఫొటోలను మీరూ చూసేయండి..