
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించి బాధలో ఉన్న భారత మహిళల క్రికెట్ జట్టుకు గుడ్‌న్యూస్. 2028 ఒలింపిక్స్‌కు హర్మన్‌ప్రీత్ సేన అర్హత సాధించింది.
ఈ మేరకు ఐసీసీ, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ధ్రువీకరించాయి. ప్రస్తుతం జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచ కప్‌లో టీమ్ఇండియా సెమీ ఫైనల్స్‌కు చేరుకోలేకపోయింది. అయితే, ఈ టోర్నీలో ఆసియా తరఫున భారత్ అత్యుత్తమ ప్రదర్శన చేసింది. దీంతో భారత జట్టు ఒలింపిక్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా కూడా క్వాలిఫై అయ్యాయి. అమెరికాలోని లాస్ ఏంజెలెస్ వేదికగా 2028 ఒలింపిక్ గేమ్స్ జరగనున్నాయి. 1900లో ఒక్కసారి మాత్రమే ఒలింపిక్స్‌లో భాగమైన క్రికెట్.. 2028లో పునరాగమనం చేయబోతున్న సంగతి తెలిసిందే. లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ పోటీలను ఆరు జట్లతో నిర్వహించనున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
ఉప్పల్: టీజీ20 లీగ్ 2026లో భాగంగా పాలమూరు స్ట్రైకర్స్, నల్గొండ నైట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాలమూరు తొమ్మిది వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ప్రజ్ఞయ్ రెడ్డి (55), బుడిది తేజ (50) హాఫ్ సెంచరీలు సాధించారు. ఈ మ్యాచ్ ఫొటోలు మీ కోసం..
ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ 2026 ఎడిషన్ నాకౌట్ స్టేజ్‌కు చేరుకుంది. లీగ్ దశలో తలపడిన 48 జట్లలో ఇప్పటికే 16 ఇంటిముఖం పట్టాయి. రౌండ్ 32 నుంచి క్వార్టర్స్‌కు మరో పదహారు జట్లు చేరతాయి. ఇప్పటి వరకు మ్యాచులను అభిమానులు ఆసక్తిగా తిలకించారు. ఆ ఫొటోలను మీరూ చూసేయండి..