
దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ భారత మార్కెట్లో గెలాక్సీ ఎం47 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. మధ్యతరగతి వినియోగదారులను లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ ఫోన్ రూ.
25 వేల లోపు విభాగంలో పోటీ పడనుంది. ముఖ్యంగా ఆరు సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్, సెక్యూరిటీ అప్డేట్లు ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ధరలో ఇంతకాలం సాఫ్ట్వేర్ సపోర్ట్ ఇవ్వడం శాంసంగ్‌కు ప్రధాన బలం.ఈ ఫోన్లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ రక్షణ కూడా ఉంది. స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో పాటు LPDDR5X ర్యామ్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌ను అందించారు. దీంతో రోజువారీ వినియోగంతో పాటు గేమింగ్కూ అనువుగా ఉంటుంది.ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. దీనికి 5 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలు జత చేశారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఈ ఫోన్లో 6000mAh భారీ బ్యాటరీ ఉంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. గేమింగ్ సమయంలో ఉపయోగపడే బైపాస్ ఛార్జింగ్ ఫీచర్‌ను కూడా అందించారు. ఈ ఫోన్లో శాంసంగ్ వన్ యూఐ అందుబాటులో ఉంటుంది. ఆబ్జెక్ట్ ఎరేజర్, ఎడిట్ సజెషన్, మై ఫిల్టర్ వంటి ఏఐ ఫీచర్లు ఉన్నాయి. ఫొటోలు, సోషల్ మీడియా కంటెంట్ రూపొందించే వారికి ఇవి ఉపయోగపడతాయని కంపెనీ చెబుతోంది. లాంఛ్ ఆఫర్లతో కలిపి ఈ ఫోన్ ప్రారంభ ధర