
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మళ్ళీ బాక్సాఫీస్ దగ్గర తన దెబ్బ రుచి చూపిస్తున్నాడు. తన అవైటెడ్ సినిమా పెద్ది చిత్రం గ్రాండ్ గా విడుదల అయ్యి సాలిడ్ వసూళ్లు రాబడుతుంది.
వర్కింగ్ డేస్ లోనే వచ్చినప్పటికీ ఈ సినిమా ఊహించని నంబర్స్ ఈ రెండు రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర రాబట్టడం విశేషం.
ఇలా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 130 కోట్లకి పైగా గ్రాస్ ని కలెక్ట్ చేసిన ఈ సినిమా రెండో రోజు అది కూడా వర్కింగ్ డే లో మరో భారీ నెంబర్ సెట్ చేసింది. ఈ డే 2 కి మరో 50 కోట్ల గ్రాస్ ని ప్రపంచ వ్యాప్తంగా రాబట్టి మొత్తం రెండు రోజుల్లో ఈ సినిమా 181.8 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్టు మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు.
సో ఈ మూడు రోజుల్లో పెద్ది గాడు డబుల్ సెంచరీ కొట్టేయడం ఖాయం అయ్యిపోయింది. సో మొత్తానికి పెద్ది గాడి మాస్ బ్యాటింగ్ అటు సినిమాలోనే కాకుండా బాక్సాఫీస్ దగ్గర కూడా ఓ రేంజ్ లో ఉందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో జగపతి బాబు, శివ రాజ్ కుమార్, జాన్వీ కపూర్ తదితరులు నటించగా రెహమాన్ సంగీతం అందించారు. అలాగే సతీష్ కిలారు నిర్మాణం వహించారు.