
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన...
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Crow doing funny thing while two snakes dancing video: సోషల్ మీడియాలో కోబ్రాల వీడియోలు నిత్యం వైరల్ గా మారుతుంటాయి. పాములు వానాకాలంలో ఆడతోడుతో కలసి నాట్యం చేస్తాయి . అందుకే వానాకాలంలొ పాములు ఎక్కువగా జనావాసాల్లోకి వస్తాయి. ఎలుకలు, కప్పలు పాముల ఫెవరెట్ ఆహరం. ఇవి ఎక్కడైతే ఉంటాయో అక్కడ పాములు ఆవాసం చేస్తాయి. కుప్పలుగా చెట్లు, పొదలు ఉన్న చోట కోబ్రాలు ఎక్కువగా సంచారం చేస్తాయి. ఈ క్రమంలో పాములు కూడా ఆడతోడు కోసం పరితపిస్తాయంటారు. ఆడ పాములు వానాకాలంలో తమ శరీరంలో నుంచి కొన్ని ప్రత్యేకమైన రసాయనాల్ని వదులుతాయి. వీటినిగ్రహించి మగ పాములు వస్తాయి. ఆ తర్వాత పాములతో అవి రాసక్రీడల్లో మునిగితెలుతాయి.
కోబ్రాలు ఎక్కడ కన్పించిన ఇటీవల చాలా మంది తమఫోన్ లలో రికార్డుచేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం రెండు కోబ్రాలు మైమర్చిపోయి ఒకదానికి మరోకటి పెనవేసుకుని నాట్యం చేస్తున్నాయి. ఇంతలో వీటి మధ్య ఒక కాకి వచ్చింది. మరీ దానికి ఏమన్పించిందో కానీ అది రొమాన్స్ చేసుకుంటున్న పాముల తోకల్ని లాగుతూ వింతగా ప్రవర్తించింది. పలుమార్లు వాటి తోకల కొనల్ని తనముక్కుతో లాగే ప్రయత్నం చేసింది.
ఇంతలో అక్కడున్న వారు కొంతమంది కాకి చేసిన వింత పనిని తమ ఫోన్ లో రికార్డు చేశారు. మరీ ఆ కోబ్రాలు కూడా కాకి డిస్టర్బ్ చేసిన ఏ మాత్రం పట్టించుకొకుండా తమ న్యాటంలో తాము మునిగిపోయాయి.
Read more: Snake In Tirumala Video: తిరుమల నడక మార్గంలో భారీ నాగుపాము హల్ చల్.. హడలిపోయిన భక్తులు.. వీడియో వైరల్..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇదెక్కడి మాస్ రావా మావా అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అవి కాటు వేస్తే కాకి ప్రాణం గాల్లో కలుస్తాయని అంటు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.