
ఇంటర్నెట్ డెస్క్: తరుణ్ భాస్కర్ (Tharun Bhasckar) దర్శకత్వంలో తెరకెక్కిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘ఈ నగరానికి ఏమైంది’ (Ee Nagaraniki Emaindi).
విశ్వక్సేన్ (Vishwak Sen), సుశాంత్ రెడ్డి, అభినవ్, వెంకటేశ్ కాకుమాను ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2018లో విడుదలై విజయాన్ని సాధించింది. దీనికి సీక్వెల్ ఉన్నట్లు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ‘ENE రిపీట్’ పేరుతో ఇది రానుంది.
‘ఈ నగరానికి ఏమైంది’ విడుదలై ఎనిమిదేళ్లు అయిన సందర్భంగా నేడు ఈ సీక్వెల్ విడుదల తేదీని పంచుకుంటూ మేకర్స్ ఓ వీడియో విడుదల చేశారు. నవంబర్ 19న ఈ సినిమా (ENE2) రానున్నట్లు తెలిపారు. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు. ‘ఈ నగరానికి ఏమైంది’ ఓటీటీలోనూ ట్రెండ్ సెట్ చేసింది.అలాగే రీ-రిలీజ్లోనూ ఊహించని కలెక్షన్లను వసూళ్లు చేసింది. దీంతో ఈ సినిమా సీక్వెల్‌ను తీయాలని భావించారు. ఇక సీక్వెల్లో అగ్ర కథానాయకుడు బాలకృష్ణ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.