అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇమ్యూనిటీని పెంచుకోవడానికి అల్లం తీసుకుంటే చాలా మంచిది. వేడిగా అల్లం టీ తాగితే మరీ మంచిది. తులసి సహజ ఔషధంగా పనిచేస్తుంది.
వానాకాలంలో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. దీనికోసం తాజా తులసి ఆకులు నమలడం లేదా తులసి టీ తాగడం మంచిది.
పసుపులో ఉండే కర్కుమిన్ ఇమ్యూనిటీని పెంచడానికి అద్భుతంగా పనిచేస్తుంది. పాలలో చిటికెడు పసుపు వేసుకుని ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుకోవచ్చు.
ఉసిరిలో విటమిన్ C ఎక్కువగా ఉంటుంది. శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తుంది. ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది.
వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. వెల్లుల్లితో శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేయొచ్చు.
పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా మారుస్తాయి. ఇమ్యూనిటీ కూడా పెంచుతాయి.
నిమ్మకాయలో విటమిన్ C ఎక్కువగా ఉంటుంది. ఇమ్యూనిటీని పెంచడానికి బాగా పనిచేస్తుంది. ప్రతిరోజూ నిమ్మరసాన్ని తాగితే మంచిది.
బాదం గింజల్లో విటమిన్ E ఉంటుంది. శరీరంలోని రక్షణ కణాల పనితీరును ఇది మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది
జీర్ణక్రియను మెరుగుపరచడానికి మిరియాలు బాగా పనిచేస్తాయి. జలుబు, దగ్గు సమస్యలు కూడా తగ్గుతాయి.