టీ20 ఛాంపియన్‌గా ఐర్లాండ్ గడ్డపై అడుగుపెట్టిన భారత్‌కు.. భారీ భంగపాటు ఎదురైంది. పసికూన ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20 మ్యాచ్‌లలోనూ టీమిండియా పరాజయం పాలైంది.
దీంతో చరిత్రలో తొలిసారిగా ఆ జట్టు చేతిలో సిరీస్ ఓడిపోయింది. అంతేకాకుండా మూడేళ్ల తర్వాత ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో ఓటమి నమోదు చేసింది. దీంతో టీమిండియాపై నెట్టింట దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి.హెడ్‌కోచ్‌గా గౌతమ్ గంభీర్ నియమితుడయ్యాక టీమిండియా.. టెస్టుల్లో ఆశించిన మేర రాణించట్లేదు. దీంతో అతడిపై ట్రోల్స్ వస్తుంటాయి. అయితే వన్డేలు, టీ20ల్లో మాత్రం సత్తాచాటుతోంది. కానీ తాజాగా ఐర్లాండ్ చేతిలో ఓటమి తర్వాత.. గంభీర్ మరోసారి ట్రోలర్స్‌కు టార్గెట్ అయ్యాడు. కానీ ఇప్పుడు ఈ జాబితాలో ఐస్లాండ్ క్రికెట్ కూడా చేరిపోయింది. ఇప్పటి వరకు ఐసీసీ సభ్యదేశం కూడా కాని ఐస్లాండ్ క్రికెట్ అసోషియేషన్ కూడా తన సోషల్ మీడియాలో గంభీర్‌ను ట్రోల్ చేసింది.“మేం (ఐస్లాండ్ క్రికెట్) గౌతమ్ గంభీర్‌ను మా కోచింగ్ స్టాఫ్‌గా తీసుకోవాలని అనుకోవడం లేదు. ఒకరకంగా మారు ఇలా చేయడం ఇష్టం లేదు కూడా. గంభీర్లో అద్భుతమైన ప్రతిభ ఉంది. కానీ భారత ఆటగాళ్లను తీసుకొచ్చి.. ఐర్లాండ్‌లో ఇలాంటి ఫలితాలను అందించాలంటే అసాధారణమైన ప్రతిభ కావాలి. అది గౌతమ్ గంభీర్ వద్ద పుష్కలంగా ఉందనిపిస్తోంది” అని ఐస్లాండ్ క్రికెట్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది.మరోవైపు పసికూన ఐర్లాండ్ చేతిలో రెండు టీ20ల సిరీస్‌ను టీమిండియా కోల్పోవడం పట్ల మాజీల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చిన్న జట్టు అనే ఉదాసీనతే భారత జట్టు ఓటమికి కారణమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఐర్లాండ్‌ను లైట్ తీసుకోవడం వల్లే.. చరిత్రలోనే అతి భయంకరమైన ఓటమి ఎదురైందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా బ్యాటర్లు షాట్ల ఎంపిక దారుణంగా ఉందని విమర్శలు సైతం వస్తున్నాయి. టాప్ ఆర్డర్ వైఫల్యం కూడా టీమిండియా కొంపముంచింది. జులై 1 నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.