
అమ్మ పిల్లల కోసం ఏం చేసేందుకైనా వెనకాడదు. పిల్లలు అభ్యున్నతి కోసమే అహర్నిశలు కష్టపడుతుంది. ఆ శ్రమ ఫలించి బిడ్డలు ప్రయోజకులుగా మారితే ఆ తల్లికి అంతకు మించిన ఆనందం ఏం ఉటుంది.
Jun 29 2026 2:48 PM | Updated on Jun 29 2026 3:00 PM
అమ్మ పిల్లల కోసం ఏం చేసేందుకైనా వెనకాడదు. పిల్లలు అభ్యున్నతి కోసమే అహర్నిశలు కష్టపడుతుంది. ఆ శ్రమ ఫలించి బిడ్డలు ప్రయోజకులుగా మారితే ఆ తల్లికి అంతకు మించిన ఆనందం ఏం ఉటుంది. ఆ సంతోషాన్నే తన తల్లికి అందిచింది ఈ కూతురు. ఆమె ఈ రోజు ఈ స్థాయిలో ఉందంటే అందుకు అమ్మే కారణం అంటూ తన విజయ ప్రస్థానాన్ని షేర్ చేసుకుంది.
అనుస్మిత మహాపాత్ర అనే యువతి తన తల్లి చేసిన త్యాగం తన ఉద్యోగ కెరీర్‌కు దారితీసేలా స్ఫూర్తిని కలిగించిందో ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. తన కాలేజ్ అడ్మిషన్ ఫీజు కోసం అమ్మ తన బంగారు గాజులున తాకట్టుపెట్టిందని. దాని వల్ల ఈ రోజు ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ పనిచేసే స్థాయికి రాగలిగానని అంటోంది. ఇది తనకు ఉద్యోగం కాదని అంతకు మించి అని భావోద్వేగంగా చెబుతోంది.
తాను ఇవాళ ఉద్యోగానికి వెళ్తున్నానంటే అది ఆమె ఆనాడు చేసిన త్యాగం కారణంగానే అంటోంది. ఇది ఆమె చేసిన త్యాగానికి నిదర్శనమని భావోద్వేగంగా అంటోంది. ఈ విషయాన్ని ఇంతవరకు ఎవ్వరికీ చెప్పలేదు. ఇప్పుడు ఆ విషయం చెప్పే సమయం ఆసన్నమైంది. ఆమె మా కోసం అన్ని చేసిందంటూ తల్లి గురించి ఇలా రాసుకొచ్చింది. "తనతల్లి అమితా మహాపాత్ర అని. ఆమె ఒక ఉపాధ్యాయురాలని, కుటుంబం ఆర్థిక ఇబ్బందులో ఉన్నప్పుడూ కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రభుత్వ ఉపాధ్యాయు వృత్తిలో చేరిందని.
నెలకు కేవలం రూ. 3000 జీతం అందుకునేది. రెగ్యులర్ అయ్యేదాక ఆరేళ్లు కాంట్రాక్టుగానే పనిచేసింది. అది కూడా భువనేశ్వర్ నుంచి రైలులో దాదాపు 12 గంటల ప్రయాణ దూరంలో ఉన్న ఒడిశాలోని రాయగడ జిల్లాలో పనిచేయాల్సి ఉంది. అందుకోసం తనను తమ్ముడిని వదిలివెళ్ల లేక ఎంతలా ఏడ్చేదో..నాటి సంఘటనను గుర్తుచేసుకుంది. అప్పుడు తాను ఐదోతరగతి, తమ్ముడు మూడో తరగతి చదువుతుండే వాళ్లం. సెలవుల కోసం ఇంటికి వచ్చిన తన తల్లి తిరిగి తన ఉద్యోగ స్థలానికి వెళ్లేందుకు రైల్వే స్టేషన్‌కు వెళ్లలేక ఆమె కళ్లల్లో కన్నీళ్లు తిరిగేవి. ఆరోజు పనికోసం ఎక్కడికో ఒక చోటుకి వెళ్లక తప్పదు కదా అని ఓదార్చిన సంఘటనను ఇప్పటికీ మర్చిపోలేను.
అంతేగాదు నిట్‌లో చేరేందుకు దాదాపు ₹1.25 లక్షలు అవసరమైతే ఏ మాత్రం ఆలోచించకుండా తన బంగారుపు గాజులను అమ్మేసింది. తాను ఇంటర్న్‌షిప్‌లు సంపాదించుకునేంత వరకు తన కాలేజ్ ఫీజులను ప్రతి సెమిస్టర్‌కు ఆమెనే చెల్లిస్తూ వచ్చారు. అలాగే తమ్ముడికి, నాకు రూ. 60 వేలు ఖరీదు చేసే చెరొక ల్యాప్‌టాప్ కొనిచ్చింది. తన సంపాదన అంత తక్కువే అయినా..మా కోసం అన్ని చేసింది. తన కోసం అంటూ ఏమి దాచుకోకుండా మొత్తం మాకే ఖర్చు చేసింది.
అందుకు ఆమెకు ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఈ రోజు నేను చేస్తున్నదంతా ఆమె కోసమే. ఆమె మాకు ఇచ్చినదాంట్లో కనీసం కొంత భాగమైన తిరిగి ఇచ్చేలా ప్రయత్నిస్తున్నా. ఆమెకు తగిన జీవితాన్ని అందించడానికి నేను చేయగలిగిందంతా చేస్తూనే ఉంటాను అంటూ పోస్ట్‌ని ముగించింది. నెటిజన్లు కూడా మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది మేడమ్ అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: భూకంపం ఎప్పుడు వస్తుందో చెప్పలేమా.? వెనెజువెలాలో ఆ కారణంగానే..)
రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్-2 ఫైనల్.. ముఖ్య అతిథిగా చిరంజీవి (ఫొటోలు)
హ్యాపీ జర్నీ అంటున్న...నటి రూప శ్రీనివాస్ (ఫొటోలు)
#RAPO23 : సందడిగా రామ్ కొత్త సినిమా లాంచ్ (ఫొటోలు)
'రాజాసాబ్' బ్యూటీ అమ్మనాన్నని చూశారా? (ఫొటోలు)
రాళ్లు విసిరిన వారిపై అటెంప్ట్ టు మర్డర్ కేసు.. ఏ ఒక్కరినీ వదిలిపెట్టం!
ఓదార్పు యాత్రలో సీఎం విజయ్.. ఏం హామీ ఇచ్చారు?
బట్టలు ఊడదీసి తరిమికొడతా: Jada Sravan Kumar
ఎండలపై సింగపూర్ మాస్టర్ ప్లాన్.. భారత్ కు సరికొత్త పాఠం
ఆపరేషన్ బాలాక్ రహస్యాలు.. ప్రపంచాన్ని ఉలిక్కిపడే వాస్తవాలు!