
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Akshay Kumar Bollywood Real Game Changer: ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లోని బడా హీరోలు యేడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడానికి అపసోపాలు పడుతున్నారు. కానీ బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్ మాత్రం ఇతర హీరోలతో అసలు కంపేర్ చేయద్దు. ఈయన యేడాదికి ఈజీగా నాలుగైదు చిత్రాలను విడుదల చేస్తూ బాలీవుడ్ బాక్సాఫీస్ అసలు సిసలు ఖిలాడీగా పేరు తెచ్చుకున్నారు. ఈ యేడాది ఏప్రిల్‌లో ‘భూత్ బంగ్లా’ సినిమాతో పలకరించారు. హార్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత తాజాగా అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘వెల్కమ్ టూ ది జంగిల్’ మూవీతో పలకరించాడు.
వెల్కమ్ టూ ది జంగిల్ అక్షయ్ కుమార్ 35వ సినిమా..
ఈ శుక్రవారం విడుదలైన ‘వెల్కమ్ టూ ది జంగిల్’ మూవీ నిన్నటితో ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకుంది. మన దేశంలో తొలి రోజు శుక్రవారం ప్రీమియర్స్‌తో కలిపి పెయిడ్ ప్రీమియర్స్.. రూ. 4.07 కోట్లు.. శుక్రవారం.. రూ. 15.33 కోట్లు.. శనివారం.. రూ. 21.02 కోట్లు.. ఆదివారం..రూ. 25.41 కోట్లు.. మొత్తంగా ఇప్పటి వరకు మన దేశంలో రూ. 65.83 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది.
త్వరలో రూ. 100 కోట్ల నెట్ వసూళ్లు దిశగా ‘వెల్కమ్ టూ ది జంగిల్’..
మొత్తంగా మన దేశంలో రూ. 83 కోట్ల గ్రాస్.. ఓవర్సీస్లో మూడు రోజుల్లో రూ. 17 కోట్ల గ్రాస్ రాబట్టింది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించింది. వరల్డ్ వైడ్‌గా రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన అక్షయ్ కుమార్ చిత్రాల్లో 35వది ‘వెల్కమ్ టూ ది జంగిల్’. మన దేశంలో త్వరలో రూ. 100 కోట్ల నెట్ వసూళ్లు సాధిస్తే.. ఈ ఘనత సాధించిన అక్షయ్ కుమార్ 21వ చిత్రంగా నిలవనుంది. మన దేశంలో రూ. 100 కోట్ల నెట్ వసూళ్లు.. రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన హీరోలు మరెవరు లేరు. ఈ వీక్ తర్వాత వచ్చే వారం కూడా హిందీలో పెద్ద చిత్రాలేవి లేకపోవడం ‘వెల్కమ్ టూ ది జంగిల్’ మూవీకి కలిసొచ్చే అంశమనే చెప్పాలి. ఇక ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ కన్నా.. స్పాట్ బుకింగ్స్ ఎక్కువగా ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే బాక్సాఫీస్ సైలెంట్‌గా ఉన్న ఈ టైమ్‌లో అక్షయ్ కుమార్ మూవీ ఈ రేంజ్లో వసూళ్లు సాధించడంపై ట్రేడ్ పండితులు, థియేటర్స్ ఓనర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.